టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌలి డైరెక్ట్ చేస్తున్నఆర్ ఆర్ ఆర్ మూవీ వేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటోంది. ఇందులో యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామచరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజైంది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో వ్యూస్‌ని సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇక తెలుగు తెరపై చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు బడా మాస్ హీరోలు కలిసి నటిస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియాభట్ నటిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో ఆలియా ఇటీవల పాల్గొంది. ఆమెతో పాటు పదిమంది వ్యక్తిగత సిబ్బందిని కూడా వెంటపెట్టుకొచ్చింది. ఇందులో నలుగురు బౌన్సర్లు, ఒక మేకప్ ఆర్టిస్ట్, పీఏ, హెయిర్ స్టైలిష్ట్, కాస్ట్యూమ్ డిజైనర్, మేనేజర్, పర్సనల్ డ్రైవర్ ఉన్నారు. వీరందరికీ ఆర్ఆర్ఆర్ మేకర్స్ హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేశారని తెలిసింది. వీరి ఖర్చు రోజుకు రూ.లక్ష దాటుతుండటంతో ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఆలియాపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.