Actor Siddharth : హీరో సిద్ధార్థ్ ను కొంతమంది రాజకీయ నాయకులు టార్గెట్ చేసారని ఆయన అభిమానులు అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. గతంలో కొంతమంది పొలిటీషియన్స్ పైన సిద్ధార్థ్ తనదైన శైలిలో కామెంట్స్ చేసారు. ఈ క్రమంలోనే తన పైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి తాజాగా ట్విట్టర్ లో ఘాటుగా రిప్లై ఇచ్చాడు సిద్ధార్థ్. సినిమా వాళ్లకు మాఫియాడాన్ లు డబ్బులు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు దానికి సమాధానం చెప్పాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. దానికి ఘాటుగా రిప్లైఇచ్చాడు సిద్ధార్థ్.
దావూద్ ఇబ్రహీం నా టీడీఎస్ చెల్లించలేదన్నారు సిద్ధార్థ్. తాను క్రమం తప్పకుండా టాక్స్ కడతానని, తనకు ఏ మాఫియాడాన్ టాక్స్ కట్టారు అని సమాధానం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా..విష్ణువర్ధన్ రెడ్డిని ఏరా.. అంటూ సంబోదించాడు. వెళ్లి పడుకో..బీజేపీ స్టేట్ సెక్రెట్రీ అంట సిగ్గుండాలి అంటూ.. ట్వీట్ చేశారు సిద్దార్థ్. గత కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో నిర్లక్యంగా వ్యవహరిస్తోందటూ విమర్శలు చేస్తున్నారు సిద్ధార్థ్. ఈ మధ్య తనను, తన కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని కూడా ఆయన ఆరోపించాడు. ఇప్పుడు హీరో సిద్ధార్థ్ -బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.
No ra. He wasn’t ready to pay my TDS. I am a perfect citizen and tax payer kadha ra Vishnu. Velli paduko. BJP State secretary anta. Siggundali. ?? https://t.co/kF67IukEfw
— Siddharth (@Actor_Siddharth) May 6, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :