వాటికి దూరంగా పవన్ కల్యాణ్.. కారణమిదేనా..!

తన సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో దర్శకులకు కండిషన్లు పెడుతున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

వాటికి దూరంగా పవన్ కల్యాణ్.. కారణమిదేనా..!

Updated on: Jun 27, 2020 | 5:12 PM

తన సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో దర్శకులకు కండిషన్లు పెడుతున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకు పవన్ నో చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉందని సమాచారం.

అసలు విషయంలోకి వెళ్తే.. తన వృత్తి పరంగా సినిమాలు చేస్తున్నప్పటికీ రాజకీయాలను మాత్రం వీడనని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు పవన్ కల్యాణ్. అంతేకాదు రాజకీయంగా ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమాల ఎఫెక్ట్ రాజకీయాలపై పడకూడదని ఆయన అనుకుంటున్నారట. అందుకే అవసరం అయితే తప్ప రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకూడదని భావించారట. అలాగే డ్యాన్స్‌లంటే ఎప్పుడూ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యే పవర్‌స్టార్, వాటిని కూడా తగ్గించమని దర్శకనిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు కూడా అలానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం పవన్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో విరూపాక్షి చిత్రాల్లో నటిస్తున్నారు. కథానుగుణంగా ఈ రెండు సినిమాల్లో పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు లేకపోయిగా నడుస్తాయి. ఇక ఈ మూవీల తరువాత పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోతుండగా.. ఆ చిత్రం ఎలా  ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతుంది. ఎందుకంటే హరీష్- పవన్ కాంబో అంటే మాస్ మూవీ అని అందరూ ఎప్పటి నుంచో అంచనాలను పెట్టుకున్నారు. ఇక మాస్ సినిమా అంటే పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు కచ్చితంగా ఉండాల్సిందే. అందులోనూ హరీష్ సినిమాల్లో ‘మాస్’ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో పవన్ కండిషన్లు ఈ రెండు చిత్రాలకేనా..? హరీష్ శంకర్ మూవీకి కండిషన్లు ఉండవా..? పవన్ ఇకపై మాస్ సినిమాల్లో నటించరా..? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us