Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు రియల్ లైఫ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఎవరో తెలుసా.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సందర్భంగా విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. రియల్ లైఫ్ ఫ్యామిలీ స్టార్, ఆయన తండ్రి దేవరకొండ గోవర్ధన్ రావుకు ఈ పోస్ట్ అంకితం చేశాడు.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు రియల్ లైఫ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఎవరో తెలుసా.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Family Star Vijay Devarakonda

Updated on: Apr 05, 2024 | 5:45 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సందర్భంగా విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. రియల్ లైఫ్ ఫ్యామిలీ స్టార్, ఆయన తండ్రి దేవరకొండ గోవర్ధన్ రావుకు ఈ పోస్ట్ అంకితం చేశాడు. అంతేకాదు.. తన తండ్రితో కలిసి దిగిన ఫొటోలతో కూడిన వీడియోను షేర్ చేసి  ‘మై ఫ్యామిలీ స్టార్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ.

‘‘నువ్వు లేకపోతే ఈ రోజు నేనున్న చోట ఉండేవాడిని కాదు. చిన్నప్పుడు నేను వేసిన మొదటి అడుగుల నుండి, ఈ రోజు నేను వేసే ప్రతి అడుగు వరకు, మీరు నా వెనుక నిలబడి నన్ను చూస్తున్నారని నాకు తెలుసు. మీరు కష్టపడ్డారు. నేను సంతోషంగా ఉండటానికి మీరు మీ సంతోషాన్ని త్యాగం చేశారు. నువ్వు నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. నువ్వే నా ఫస్ట్ హీరో. నువ్వే నా బలం. ‘నేను ఎప్పుడైనా మిమ్మల్ని బాధపెట్టినా, నిరాశపరిచినా నన్ను క్షమించండి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకోండి. మిమ్మల్ని గర్వపడేలా చేయడమే నా అతిపెద్ద విజయం, మీరు ఎప్పటికీ మై ఫ్యామిలీ స్టార్ అవుతారు.

ఈ వీడియోతో పాటు విజయ్ దేవరకొండ (నా హీరో) అంటూ క్యాప్షన్ ఇచ్చారు. జీవితం ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి.  కానీ మిమ్మల్ని గర్వపడేలా, సంతోషంగా ఉంచడానికి నేను ప్రతిరోజూ పనిచేస్తా. ఐ లవ్ యూ మై సూపర్ స్టార్. నేను చేసిన ఈ సినిమా ప్రతి వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ విషయాలను గుర్తుకుచేస్తుంది. కుటుంబం కోసం పోరాడే ప్రతి మగాడు, ప్రతి మహిళ, ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి ఫ్యామిలీ స్టార్ అని ఈ సందర్బంగా పోస్ట్ లో ఎమోషన్ అయ్యారు విజయ్ దేవరకొండ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us