అమెరికా లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మకమైన మిస్ యూనివర్స్ పోటీల్లో అమెరికా అందగత్తె ఆర్ బానీ గాబ్రియేల్ విజేతగా నిలిచింది. దాదాపు 80 దేశాలకు చెందిన అందాల భామలు ఈ అందాల కిరీటం కోసం పోటీపడ్డారు. అయితే అందంలోనూ, వాక్చుతుర్యంలోనూ న్యాయ నిర్ణేతలతో పాటు అందరి మనసులు గెల్చుకున్న గాబ్రియేలా విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా భారతీయ భామ, మిస్ యూనివర్స్ హర్నజ్ సంధు కౌర్ హాజరయ్యారు. అందాల పోటీలను ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే పోటీలు తుది అంకానికి చేరేక్రమంలో హర్నాజ్ ఎమోషనల్ అయ్యింది. విశ్వ సుందరి పేరును ప్రకటించేటప్పుడు స్టేజ్‌పైకి వచ్చిన ఆమె.. మిస్ యూనివర్స్ హోదాలో చివరిసారిగా ర్యాంప్‌పై వాక్ చేశారు. అయితే గతేడాది స్మృతులు గుర్తుచ్చాయేమో ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుందామె. ఈక్రమంలో స్టేజ్‌పైనే జారి పడిపోబోయారు. వెంటనే తమాయించుకున్న హర్నాజ్ సింధూఆమె తిరిగి వాక్ కొనసాగించింది. అనంతరం మిస్ యూనివర్స్ 2022గా నిలిచిన గాబ్రియేల్‌కు విశ్వసుందరి కిరీటం అలంకరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా గతేడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది హర్నాజ్ కౌర్ సంధూ. తద్వారా సుమారు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక విశ్వసుందరి కిరీటం దక్కేలా చేసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ‘మిస్ యూనివర్స్ 2021’ పోటీలకు వెళ్లిన ఈ చండీగఢ్ సొగసరి తన అందం, అంతకుమించిన తెలివితేటలతో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. తద్వారా సుస్మితా సేన్, లారాదత్తాల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీక్వీన్‌గా గుర్తింపు పొందింది. ఇక మిస్ యూనివర్స్ పోటీల తర్వాత హర్నాజ్ క్రేజ్ ఆకాశానికి చేరుకుంది. వెండితెరపై అవకాశాలు కూడా వస్తున్నాయి.
Hold back tears as @HarnaazKaur takes the stage one last time as Miss Universe! #MISSUNIVERSE pic.twitter.com/L0PrH0rzYw
— Miss Universe (@MissUniverse) January 15, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..