Guess Actress: ఉంగరాల జుట్టు మాటున దోబూచులాడుతోన్న అందం.. ఇంతకీ ముద్దుగుమ్మ ఎవరో చెప్పగలరా.?

|

Nov 29, 2022 | 1:33 PM

ఒకప్పుడు సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు అంత సులువుగా తెలిసేవి కావు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తారలు నేరుగా తమ వివరాలను అభిమానులతో పంచుకుంటున్నారు...

Guess Actress: ఉంగరాల జుట్టు మాటున దోబూచులాడుతోన్న అందం.. ఇంతకీ ముద్దుగుమ్మ ఎవరో చెప్పగలరా.?
Guess The Actress
Follow us on

ఒకప్పుడు సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు అంత సులువుగా తెలిసేవి కావు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తారలు నేరుగా తమ వివరాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తమ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను షేర్‌ చేస్తున్నారు. అంతేనా.. నేరుగా అభిమానులతో మాట్లాడుతూ, వారి సందేహాలకు సమాధానాలు కూడా ఇస్తున్నారు.

ఇలా నిత్యం సోషల్‌ మీడియాలో ఏదో ఒక పోస్ట్ వైరల్‌ అవుతూనే ఉంది. తాజాగా ఓ అందాల తార ఇలాంటి ఓ ఫొటోనే పోస్ట్‌ చేసింది. పైన ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఉంగరాల జుట్టుతో ముఖం కనిపించకుండా ఉన్న ఈ బ్యూటీ కుర్రకారు కలల రాకుమారి. పేరుకు మలయాళి అయినా తెలుగు ఇంటి అమ్మాయిల కనిపిస్తుందీ చిన్నది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ, గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.?

ఇవి కూడా చదవండి

ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీకి ఇచ్చి.. అఆ చిత్రంలో తెలుగు వారిని పలకరించిన అనుపమే ఈ అందాల తార. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్‌ శారీలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అనుపమ చీర కట్టిన తీరు చీరకే అందం తెచ్చేలా ఉందంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..