
దేశమంతటా వినాయక చవితి పండగ వాతావరణం సంతరించుకుంది. సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ బొజ్జ గణపయ్యను తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మన టాలీవుడ్ ప్రముఖులు కూడా తమ నివాసాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పండగను ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ , ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి తమ కుమారుడు వాయువ్ తేజ్‌తో కలిసి నివాసంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన ఈ దంపతులు, తమ పూజా విశేషాలను సోషల్ మీడియాలో పంచుకోగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
మాజీ మంత్రి, నటి రోజా సెల్వమణి తన కుటుంబ సభ్యులతో కలిసి గణేశుడికి నిష్టతో పూజలు నిర్వహించారు. నివాసాన్ని వర్ణశోభితంగా అలంకరించి, స్వామివారికి రకరకాల నైవేద్యాలను సమర్పించారు. ఈ పండగ వేడుకలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటి స్నేహా కూడా తన ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పండగను జరుపుకున్నారు. చీరకట్టులో ఎంతో అందంగా కనిపించిన స్నేహా, పూజా కార్యక్రమాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల ఇళ్లలోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టాలీవుడ్ భామలు మృణాల్ ఠాకూర్, హన్సిక మోత్వానీ వంటి నటీమణులు కూడా వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి తమ ఇళ్లకు తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రతి ఏటా గణేష్ చతుర్థి పండగ సినీ పరిశ్రమలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. సినీ తారలందరూ షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి బొజ్జ గణపయ్య ఆశీస్సులు పొందడం పరిపాటిగా మారింది. ఈసారి కూడా టాలీవుడ్ తారల ఇళ్లలో గణపతి బప్పా మోరియా నినాదాలు మిన్నంటుతున్నాయి!
ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‌కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..