Tollywood : ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టులో లాయర్.. ఎవరంటే..

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. కథానాయికగా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందం, అభినయంతో మెప్పించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్ గా పనిచేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

Tollywood : ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టులో లాయర్.. ఎవరంటే..
Reshma Rathod

Updated on: Aug 29, 2026 | 3:37 PM

సినిమా గ్లామర్ ప్రపంచంలో వెలుగొందిన తారలు ఆ తర్వాత వేరే రంగాల్లో స్థిరపడటం అరుదుగా జరుగుతుంటుంది. అయితే, టాలీవుడ్‌లో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అచ్చతెలుగు అమ్మాయి రేష్మ రాథోడ్ మాత్రం సినీ పరిశ్రమను వీడి ఏకంగా దేశ అత్యున్నత నాయ్యస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా స్థిరపడి సరికొత్త స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రేష్మ రాథోడ్, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. చిన్నతనం నుంచే నటనపై ఉన్న మక్కువతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఈరోజుల్లో’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషా చిత్రాలలోనూ నటనతో ఆకట్టుకున్నారు. 2017 వరకు పలు చిత్రాలలో నటించినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయాలు రాకపోవడంతో ఆమె నటనకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. తనకు నచ్చిన రంగంలో స్థిరపడాలనే లక్ష్యంతో న్యాయశాస్త్రం (Law) చదివిన రేష్మ, లా కోర్సు విజయవంతంగా పూర్తి చేశారు.

న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆమె, క్రమంగా తన నైపుణ్యంతో ఎదుగుతూ ప్రస్తుతం ఢిల్లీలోని సుప్రీంకోర్టులో న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా, ఆమె రాజకీయాల పట్ల కూడా ఆసక్తి చూపిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సినీ రంగుల ప్రపంచం నుంచి అత్యున్నత న్యాయస్థానంలో లాయర్‌గా మారిన రేష్మ రాథోడ్ ప్రయాణం ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

రేష్మా రాథోడ్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us