Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..

సినిమా ఇండస్ట్రీని  కరోనా  వదిలిపెట్టేలా కనిపించడం లేదు. రోజురోజుకు మహమ్మారి బారిన పడుతున్న సినీ ప్రముఖుల జాబితా పెరుగుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అందరూ ఈ వైరస్ కోరలకు చిక్కుతున్నారు.

Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..
Dulquer Salmaan

Updated on: Jan 20, 2022 | 10:31 PM

సినిమా ఇండస్ట్రీని  కరోనా  వదిలిపెట్టేలా కనిపించడం లేదు. రోజురోజుకు మహమ్మారి బారిన పడుతున్న సినీ ప్రముఖుల జాబితా పెరుగుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అందరూ ఈ వైరస్ కోరలకు చిక్కుతున్నారు. కాగా  ఇటీవల  మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.   ప్రస్తుత్తం ఆయన ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. కాగా  ఆయన కుమారుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా అనుమానంతో  కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా  పాజిటివ్ తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా  సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

“నాకు  కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. కొద్దిగా జలుబు తప్ప నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల కాలంలో ఎవరైతే నాతో పాటు షూటింగ్ సెట్ లో కలిసి ఉన్నారో వారందరు ఐసోలేషన్ లో ఉండండి.. లక్షణాలు కనిపిస్తే  కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. ఈ పాండమిక్ ఇంకా అవ్వలేదు.. అందరూ జాగ్రత్తగా ఉండండి. దయచేసి మాస్క్ ధరించండి.. సేఫ్ గా ఉండండి’ అని తన అభిమానులకు సూచించాడు దుల్కర్.   కాగా మూడు రోజుల గ్యాప్ లోనే తండ్రికొడుకులిద్దరూ కరోనా బారిన పడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షిస్తూన్నారు.

Also Read: TV9 Digital TOP 9 NEWS : 5జీ దెబ్బకు నిలిచిన విమానాలు.. వ్యాక్సిన్‌ వద్దంటూ చెట్టెక్కిన యువకుడు.!(వీడియో)

Viral Photos: ఐదువేల బడ్జెట్‌లో ఇండియాలోని ఈ అందమైన ప్రదేశాలను చూడవచ్చు.. ఎలాగంటే..?

TV9 Digital News Round Up : అప్సరరాణి నోట క్యాస్టింగ్‌కౌచ్‌ మాట | కోళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు..( వీడియో)

Loading...
Unable to load recommendations.
Follow Us