Tollywood: అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం.. కుర్రాళ్ల మనసు దోచుకున్న బ్యూటీ ఎవరంటే..

హిందీ చిత్ర పరిశ్రమలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టారు. చిన్నప్పటి సహజ నటనతో మెప్పించి సక్సెస్ అయ్యారు. అలాంటి ప్రతిభావంతులైన నటీనటులలో ఓ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. అబ్బాయిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా కుర్రాళ్ల గుండెలను దొచేసింది. ఇప్పుడు హీరోయిన్ గా సరైన అవకాశాలను అందుకుంటూ రాణిస్తుంది. ఆమె మరెవరో కాదు.. అహ్సాస్ చన్నా.

Tollywood: అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం.. కుర్రాళ్ల మనసు దోచుకున్న బ్యూటీ ఎవరంటే..
Ahaas Channa
Follow us

|

Updated on: Apr 25, 2024 | 10:36 AM

సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులుగా చాలా మంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పెద్దయ్యాక హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ అందులో కొందరు మాత్రమే తమకంటూ స్టార్ డమ్ అందుకుని ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు. తెలుగులో తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్, అలియా భట్ వంటి స్టార్స్ ఒకప్పుడు బాలనటీనటులుగా అలరించారు. హిందీ చిత్ర పరిశ్రమలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టారు. చిన్నప్పటి సహజ నటనతో మెప్పించి సక్సెస్ అయ్యారు. అలాంటి ప్రతిభావంతులైన నటీనటులలో ఓ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. అబ్బాయిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా కుర్రాళ్ల గుండెలను దొచేసింది. ఇప్పుడు హీరోయిన్ గా సరైన అవకాశాలను అందుకుంటూ రాణిస్తుంది. ఆమె మరెవరో కాదు.. అహ్సాస్ చన్నా. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన కభీ అల్విదా నా కెహనా సినిమాలో అహాస్ చన్న నటించింది. ఇందులో షారుఖ్ ఖాన్, ప్రీతి జింటాల కొడుకుగా కనిపించింది.

అహ్సాస్ చన్నా ఆగష్టు 5, 1999న ముంబైలోని పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఇక్బాల్ సింగ్ చన్నా పంజాబీ సినిమా నిర్మాత, తల్లి కుల్బీర్ బడేస్రాన్ నటి. ‘వీర్-జారా’, ‘కేసరి’, ‘మంటో’, ‘సీఐడీ’, ‘క్రైమ్ పెట్రోల్’ వంటి సినిమాల్లో నటించింది. అలాగే టీవీ, వెబ్ షోలలో కనిపించింది. అహ్సాస్ ఐదేళ్ల వయసులో నటించడం ప్రారంభించింది. ఈ బ్యూటీ మొదట ‘వాస్తు శాస్త్రం’లో సుస్మితా సేన్ కొడుకు రోహన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. 2004లో విడుదలైన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన 2006 చిత్రం కభీ అల్విదా నా కెహనాలో అహ్సాస్ నటించింది. షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా కొడుకు అర్జున్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

2007లో వచ్చిన మై ఫ్రెండ్ గణేష్ చిత్రంలో గణేష్‌తో స్నేహం చేసే అబ్బాయి ఆశు పాత్రలో నటించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 2008 హారర్ చిత్రం ఫూంక్‌లో అహ్సాస్ రక్ష పాత్రను పోషించింది. హీరోయిన్‌గా ఆమెకు ఇదే మొదటి సినిమా. తరువాత ‘కసమ్ సే’, ‘దేవాన్ కే దేవ్ మహాదేవ్’, ‘ఓయే జస్సీ’, ‘MTV ఫనా’, ‘క్రైమ్ పెట్రోల్’, ‘CID’ వంటి అనేక టీవీ షోలలో కనిపించింది. ట్రాన్సిస్టర్ అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించింది.

వెబ్ సిరీస్ ఛాన్స్ వచ్చిన తర్వాత అహ్సా్స్ అదృష్టం మారిపోయింది. ‘గర్ల్స్ హాస్టల్’, ‘కోటా ఫ్యాక్టరీ’, ‘హాస్టల్ డేస్’, ‘మిస్‌మ్యాచ్డ్ 2’, ‘హాఫ్ సిఎ’ వంటి ప్రముఖ వెబ్ సిరీస్‌లలో ఆమె నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చాలా బిజీగా ఉంటుంది. ఇన్ స్టాలో అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా పనిచేస్తుంది. ఇప్పటివరకు నికర విలువ రూ.10 కోట్లు సమాచారం. ప్రస్తుతం అహ్సాస్ వయసు 24 ఏళ్లు మాత్రమే.

View this post on Instagram

A post shared by Ahsaas Channa (@ahsaassy_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
దేవకన్యగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ?..
దేవకన్యగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ?..
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసులో సంచలన ట్విస్ట్..!
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసులో సంచలన ట్విస్ట్..!