అమృతా అయ్యర్ అదిరేటి లుక్స్.. చూస్తే మతిపోవాల్సిందే

Phani.ch

04 May 2024

ముద్దుగుమ్మ అమృతా అయ్యర్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా వచ్చిన ‘హనుమాన్’ మూవీ తో తెలుగు ప్రెకషకులకు మరింత దగ్గరైంది.

అమృతా అయ్యర్ తమిళనాడులోని చెన్నైలో 14 మే 1994న జన్మించింది. పుట్టింది చెన్నై అయినా బెంగళూరులో పెరిగింది ఈ ముద్దుగుమ్మ.

బెంగళూరులో సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది. తర్వాత మోడల్‌గా కెరీర్ ను ప్రారంభించింది.

2012 నుండి తన నటన కెరీర్ మొదలు పెట్టింది ఈ చిన్నది. మొదటిలో తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమలో ఎదుగుతోంది ఈ ముద్దుగుమ్మ.

అమృతా అయ్యర్ విజయ్ దళపతి ‘బిజిల్’ చిత్రంలో తన నటనకు మంచి గుర్తింపు దక్కించుకుంది. రామ్ పోతినేని ‘రెడ్’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

తరువాత యాంకర్ ప్రదీప్ హీరో గా నటించిన  30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే చిత్రంతో మంచి గుర్తిపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

రీసెంట్ గా హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. హనుమాన్ సినిమాతో ఈ అమ్మడి కెరీర్ ఉపందుకునేలా కనిపిస్తుంది.