కెరీర్ తొలినాళ్లలో బ్యాడ్‌లక్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అత్యధిక పారితోషికం అందుకుంటూ ప్రస్తుతం వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. తన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
మీరు కనిపెట్టారా ఆ హీరోయిన్ ఎవరో.? ఇంకా లేదంటే.. మీకో చిన్న క్లూ.! 2012లో తమిళ హీరో జీవా సరసన ‘మూగమూడి’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించింది. హా.. ఎస్.. కరెక్టే ఆమెవరో కాదు.. పూజా హెగ్డే. ‘మూగమూడి’, ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’, ‘మొహెంజొదారో’ చిత్రాలతో డీలాపడ్డ పూజా హెగ్డే.. ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాధం’, ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అలా వైకుంఠపురం’ సినిమాలతో వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను అందుకుంది.
అయితే ఇప్పుడు మరోసారి పూజా హెగ్డేకు ‘రాదేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, ‘సర్కస్’ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర వరుస ఫ్లాప్స్ అందాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో నటిస్తోన్న ‘కిసీ ఖా భాయి కిసీ కి జాన్’, మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఓ చిత్రంపైనా పూజా హెగ్డే ఆశలు పెట్టుకుంది.