3 సినిమాలకే సెన్సేషన్.. స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.. కానీ 25 ఏళ్లకే ఆత్మహత్య..

సినీ గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసి.. అనుకోకుండా తిరిరిగాని లోకాలకు వెళ్లిన తారలు చాలా మంది ఉన్నారు. చిన్న వయసులోనే వెండితెరపై తమ నటనతో అలరించిన హీరోయిన్స్ మరణాలు ఇప్పటికీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అందులో మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుంది. అయినా ఇప్పటికీ ఆమె పేరు మారుమోగుతూనే ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.

3 సినిమాలకే సెన్సేషన్.. స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.. కానీ 25 ఏళ్లకే ఆత్మహత్య..
Jiah Khan

Updated on: Jun 25, 2026 | 12:51 PM

బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకానొక దశలో అత్యంత ఆకర్షణీయమైన తారగా.. అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జియా ఖాన్ (అసలు పేరు నఫ్సియా రిజ్వీ ఖాన్). తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో విపరితీమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ మీకు తెలుసా.. ? ఆమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కెరీర్ ఆరంభంలోనే అనూహ్యమైన విజయాలను అందుకున్నప్పటికీ, ఆమె జీవితం విషాదాంతం కావడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. హిందీలో చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ 18 ఏళ్ల వయసులోనే సెన్సేషన్ అయ్యింది. అమెరికాలో జన్మించి లండన్‌లో పెరిగిన జియా ఖాన్, చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకుంది. నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత, సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకి చేరుకుంది. 2007లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘నిశ్శబ్ధ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటుడి సరసన నటించినా, తనదైన శైలిలో అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా కోసం ఆమె ‘ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ’ అవార్డుకు నామినేట్ కూడా అయ్యింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

మొదటి సినిమా తర్వాత జియా ఖాన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘గజినీ’ (హిందీ), ‘హౌస్‌ఫుల్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆమె అందుకున్న స్టార్‌డమ్ చాలామంది వర్ధమాన నటులకు కలగా మిగిలిపోయింది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తరుణంలో ఆమె మరణం అందరినీ కలచివేసింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె 2013 జూన్ 3న ముంబైలోని జుహులోని తన ఫ్లాట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్తతో యావత్ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆమె తన తల్లి, సోదరి ఇంట్లో లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

అయితే జియా ఖాన్ మరణం వెనుక ఆత్మహత్య జరిగిందని కొందరు వాదిస్తుంటే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఇది కచ్చితంగా హత్యేనని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ వచ్చారు. ఆమె కెరీర్ , వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, రిలేషన్‌షిప్ సమస్యలు ఆమెను తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాయని వార్తలు వచ్చాయి. ఆమె చనిపోయిన 4 రోజుల తర్వాత తన ఫ్లాట్ లో 6 పేజీల సూసైడ్ నోట్ లభించింది. అందులో తన ప్రియుడు సూరజ్ పంచోలీపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. సూరజ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని.. బలవంతంగా తనను అబార్షన్ చేయించాడని.. దీంతో తాను మానసికంగా కుంగిపోయినట్లు రాసుకొచ్చింది. సూరజ్ చాలా కాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని రాసుకొచ్చింది. దీంతో అతడిని 2013 జూన్ 10న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ జూలై 2న అతడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో ఏళ్ల తరబడి విచారణలు, ఆరోపణలు కొనసాగినా, ఈ కేసులో ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకలేదు. సినిమా రంగుల ప్రపంచంలో వెలిగిపోవాలని వచ్చిన నటులకు, తెరవెనుక ఉండే చీకటి కోణాలు, ఒత్తిళ్లు వారి జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి జియా ఖాన్ మరణం ఒక విషాదకర ఉదాహరణగా నిలిచింది. ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ప్రశ్నలు & సమాధానాలు..

ప్రశ్న : అసలు ఎవరీ జియాఖాన్.. ?

జవాబు : బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్..

ప్రశ్న : జియా ఖాన్ హిందీలో ఎన్ని సినిమాలు చేసింది.. ?

జవాబు : మూడు సినిమాలు..

ప్రశ్న : జియా ఖాన్ ప్రియుడి పేరు ఏంటీ.. ?

జవాబు : సూరజ్ పంచోలి.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

జియా ఖాన్ ఫోటో..

Jiah Khan News

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us