AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : మూవీ చూసి ఇదేం సినిమా అన్నారు.. కట్ చేస్తే.. ఏకంగా నాలుగు జాతీయ అవార్డులతో సంచలనం..

దర్శకుడు వంశీ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఒకప్పుడు ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతూ తన సితార చిత్రం పొందిన 4 జాతీయ అవార్డుల అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన స్త్రీ పాత్రల చిత్రణ, కళ్ళతో అనుబంధం, రచయిత చలం సాహిత్యం ప్రభావం గురించి వివరించారు. హీరోయిన్ల ఎంపికలో ఆయన వ్యక్తిగత దృష్టి, చిత్ర నిర్మాణంలోని సవాళ్ళను కూడా వెల్లడించారు.

Cinema : మూవీ చూసి ఇదేం సినిమా అన్నారు.. కట్ చేస్తే.. ఏకంగా నాలుగు జాతీయ అవార్డులతో సంచలనం..
Sitara Movie
Rajitha Chanti
|

Updated on: Sep 02, 2026 | 12:07 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం సృష్టించిన దర్శకుడు వంశీ, తన అద్భుత సృష్టి సితార చిత్రానికి లభించిన జాతీయ అవార్డుల గురించి, తన సినీ ప్రస్థానం, స్త్రీ పాత్రల చిత్రణపై తన ఆలోచనలను గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించే వంశీ, సితార జాతీయ పురస్కారాల విజయం వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు. సితార చిత్రానికి నాలుగు జాతీయ అవార్డులు లభించడం తన సినీ జీవితంలోనే గొప్ప విశేషంగా చెప్పుకొచ్చారు. ఆ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న క్షణాలు, ముఖ్యంగా రాష్ట్రపతి తన చేయిని ఎక్కువ సేపు పట్టుకోవడం తనకు మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని వంశీ గుర్తు చేసుకున్నారు. ఇన్ని అడుగులు నడిచి, అవార్డు తీసుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చి, జనంలోకి చూసి నవ్వి, ఫోటో తీయించుకుని దిగిపోయే ప్రతీది ఒక కౌంట్ ఉంటుందని, అందుకు రిహార్సల్ కూడా చేస్తారని ఆయన తెలిపారు. సితార చిత్రానికి ఉత్తమ ఎడిటర్, ఎస్. జానకి గారికి “వెన్నెల్లో గోదారందం” పాటకు ఉత్తమ గాయని, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ప్రొడక్షన్ విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

వంశీ సినిమాల్లో స్త్రీ పాత్రల కళ్లకు ఇచ్చే ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ, తన సినిమాల్లో అమ్మాయి కళ్లే అందం అని తాను నమ్ముతానని చెప్పారు. ఈ నమ్మకానికి ఒక వ్యక్తిగత అనుభవం ప్రేరణ. చిన్నతనంలో తన పక్క ఊరిలోని ఆసుపత్రిలో ఒక నర్సు కళ్లను చూసి ముగ్ధుడనయ్యానని, రోజూ సైకిల్‌పై ఆమెను చూడటానికి వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. ఒక రోజు ఆమె చనిపోయిందని తెలిసి తీవ్ర నిరాశకు గురయ్యానని, ఆ తర్వాత మద్రాసులో అలాంటి కళ్లే తన హీరోయిన్‌గా మారిన అమ్మాయిలో చూశానని తెలిపారు. ఆ అమ్మాయిని తనే పరిచయం చేశానని, అది తన రెండో చిత్ర హీరోయిన్ అని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

సితార చిత్ర ముగింపుపై మాట్లాడుతూ, తన నవల “మహల్లో కోకిల”లో ముగింపు వేరుగా ఉంటుందని, నవలలో హీరో హీరోయిన్లిద్దరూ చనిపోతారని చెప్పారు. కానీ సినిమాకి వచ్చేసరికి నిర్మాత సూచన మేరకు ముగింపును మార్చాల్సి వచ్చిందని తెలిపారు. తన స్త్రీ పాత్రలకు స్ఫూర్తిని చలం సాహిత్యం నుంచి పొందానని వంశీ అన్నారు. చలం, లత, బుచ్చిబాబు వంటి రచయితల సాహిత్యం తన బాల్యాన్ని ప్రభావితం చేసిందని, ముఖ్యంగా చలం గారి స్త్రీల గురించి రాసిన విధానం తనపై బలమైన ముద్ర వేసిందని చెప్పారు. హీరోయిన్ల ఎంపికలో తన గురువు భారతీరాజా గారి మాట “ప్రపంచంలో ప్రతీ మనిషి ఆర్టిస్టేరా. ఆ క్యారెక్టర్ వాడు సూట్ అయినప్పుడు… ప్రతీ అమ్మాయి హీరోయిన్ రా, ఆ క్యారెక్టర్ కి ఆ అమ్మాయి సూట్ అయినప్పుడు…” తనపై బలంగా పనిచేసిందని వంశీ వెల్లడించారు. కథలోని క్యారెక్టర్‌కు సరిపోయే వ్యక్తిని వెతుక్కునేవాడినని, తన మైండ్‌లో ఉన్న క్యారెక్టరైజేషన్‌కు తగ్గట్టుగానే హీరోయిన్‌ను ఎంపిక చేసేవాడినని ఆయన తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

Follow Us