Director Shankar: ఒకే టైంలో ఇద్దరు స్టార్ హీరోల మూవీస్.. డబుల్‌ గేమ్ ఆడుతున్న స్టార్ డైరెక్టర్ శంకర్‌

Director S Shankar: స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకే టైమ్‌లో ఇద్దరు స్టార్ హీరోల మూవీలను పట్టాలెక్కించే పనిలో పడ్డారు.

Director Shankar: ఒకే టైంలో ఇద్దరు స్టార్ హీరోల మూవీస్.. డబుల్‌ గేమ్ ఆడుతున్న స్టార్ డైరెక్టర్ శంకర్‌
Director Shankar
Image Credit source: Twitter

Updated on: Jul 26, 2022 | 2:44 PM

Director Shankar: సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డబుల్‌ గేమ్‌కు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్న శంకర్.. నెక్ట్స్ మరో బిగ్ మూవీని పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. చెర్రీతో బిగ్ బడ్జెట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు గ్రేట్‌ డైరెక్టర్ శంకర్. వింటేజ్‌ శంకర్‌ను గుర్తు చేసేలా… సోషల్ మెసేజ్‌ను, కమర్షియల్‌ ఫార్ములాను మిక్స్‌ చేసి ఈ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా శంకర్‌ లైన్‌లో పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్‌ సినిమాకు ముందు కమల్‌ హాసన్‌ హీరోగా ఇండియన్ 2 సినిమాను శంకర్ స్టార్ట్ చేశారు. కానీ ప్రొడక్షన్ హౌస్‌తో వివాదాలతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో చెర్రీ సినిమా లైన్‌లోకి వచ్చింది.

కానీ రీసెంట్‌గా విక్రమ్ సక్సెస్‌తో కమల్‌ హాసన్ ఫామ్‌లోకి రావటంతో మళ్లీ ఇండియన్ 2 విషయంలో కదలిక వచ్చింది. ఈ సినిమాను రీస్టార్ట్ చేసేందుకు కమల్ ప్రయత్నాలు ప్రారంభించారు. కమల్‌ రాయభారం ఫలించింది. ఇండియన్‌ 2ను కంప్లీట్ చేసేందుకు శంకర్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆల్రెడీ చెర్రీ సినిమా సెట్స్ మీద ఉంది. ఆ తరువాత రణవీర్‌ సింగ్‌తో అన్నియన్‌ రీమేక్‌ చేయాల్సి ఉంది. ఈ కమిట్మెంట్స్‌కు ఇబ్బంది కలగకుండా ఒకేసారి రెండు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ శంకర్‌.

ఇండియన్‌ 2 కోసం మరో వంద రోజులు వర్క్‌ చేయాల్సి ఉంది. అందుకే చరణ్ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆ వర్క్‌ కూడా ఫినిష్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని కుదిరితే నెక్ట్స్ ఇయర్‌ సమ్మర్‌లోనే ఇండియన్‌ 2ను కూడా ఆడియన్స్‌ ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్‌. మరి శంకర్ వేసిన ఈ స్కెచ్‌ ఎంత వరకు వర్క్ అవుట్‌ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

(సతీష్, ET టీమ్, టీవీ9 తెలుగు)

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

Loading...
Unable to load recommendations.
Follow Us