Venkatesh : వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ కుర్రాళ్ల ఫేవరేట్ మూవీ..

ప్రముఖ దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తన మొదటి చిత్రంలో ఐశ్వర్య రాయ్‌ను ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కథానాయిక పాత్రకు ఆమె సరిగ్గా సరిపోరని భావించి ఆ స్థానంలో మరో కథానాయికను వెంకీకి జోడిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Venkatesh : వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ కుర్రాళ్ల ఫేవరేట్ మూవీ..
Venkatesh, Aishwarya Rai

Updated on: Oct 10, 2026 | 7:32 AM

టాలీవుడ్ పరిశ్రమలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్లతో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన ప్రముఖ దర్శకుడు జయంత్ సి. పరాన్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన సినిమా కెరీర్ ప్రారంభ రోజులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా గ్లోబల్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కి సంబంధించిన ఒక షాకింగ్ నిజం బయటపెట్టారు. ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట బాలీవుడ్ అగ్రరాజ్యం అందాల తార ఐశ్వర్య రాయ్‌ను సంప్రదించినట్లు జయంత్ సి. పరాన్జీ వెల్లడించారు. అయితే ఆ సమయంలో ఐశ్వర్య రాయ్ టాలీవుడ్‌కు లేదా అప్పటికి పెద్దగా పరిచయం లేని కొత్త నటి కావడంతో పాటు, ఆ పాత్రకు ఆమె అప్పటికి సరిగ్గా సరిపోరని భావించారట. అంతేకాకుండా ఆమె అప్పటికీ ఇంకా స్టార్ హీరోయిన్‌గా స్థిరపడకపోవడం, సినిమా కథకు అనుగుణంగా ఒక ప్రసిద్ధ లేదా సరికొత్త ముఖం కావాల్సి రావడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పంచుకున్నారు.

ఆ తర్వాతే ఈ చిత్రంలో హీరోయిన్‌గా అంజలా జవేరిని ఎంపిక చేసినట్లు జయంత్ తెలిపారు. వికటేష్ సరసన అంజలా జవేరి నటన, వారిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే.

జయంత్ సి. పరాన్జీ కేవలం ఒక్క చిత్రంతోనే ఆగిపోకుండా టాలీవుడ్‌లోకి బాలీవుడ్ , ఇతర భాషల నుంచి ఎంతో మంది అందాల తారలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనతను దక్కించుకున్నారు. ప్రీతి జింటా, సోనాలి బింద్రే, బిపాసా బసు, లీసా రే వంటి ప్రముఖులను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలైన వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. తాజాగా ఆయన చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..

ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..

Loading...
Unable to load recommendations.
Follow Us