Dragon Movie: ఎన్టీఆర్ కోసం రంగంలోకి బాలీవుడ్ సెన్సేషన్.. డ్రాగన్ మ్యూజిక్‏కు ఇక థియేటర్లు షేక్ అవ్వాల్సిందే..

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’. అయితే ఈ సినిమా గురించి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ఇప్పుడు బాలీవుడ్ సెన్సేషన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Dragon Movie: ఎన్టీఆర్ కోసం రంగంలోకి బాలీవుడ్ సెన్సేషన్.. డ్రాగన్ మ్యూజిక్‏కు ఇక థియేటర్లు షేక్ అవ్వాల్సిందే..
Dragon Movie Update

Updated on: Nov 01, 2026 | 10:05 AM

ఆర్ఆర్ఆర్, దేవర వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా డ్రాగన్. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చగా, తాజాగా ఈ చిత్రంలోని సంగీతానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ‘డ్రాగన్’ చిత్రానికి కన్నడ మ్యూజిక్ కంపోజర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఆయనతో పాటు బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్ కూడా జతకట్టనున్నారని సమాచారం. ‘ధురంధర్’ చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న శాశ్వత్ సచ్‌దేవ్, ఈ సినిమాలో కొన్ని కీలకమైన పాటలను కంపోజ్ చేయనున్నారట. రవి బస్రూర్ మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ చూసుకుంటుంటే, శాశ్వత్ సచ్‌దేవ్ కూడా తన మ్యూజిక్‌తో ఈ చిత్రానికి మరింత హైప్ తీసుకురానున్నారని తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

శాశ్వత్ సచ్‌దేవ్ గతంలో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘కిల్’, ‘ఆర్టికల్ 370’, ‘ధురంధర్’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు తెలుగులోనూ నిఖిల్ నటిస్తున్న ‘ది ఇండియన్ హౌస్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆయన, ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ మూవీలోనూ భాగం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

ఎన్టీఆర్ ఆర్ట్స్ , మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజూ మీనన్, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ భారీ యాక్షన్ డ్రామాను 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

శాశ్వత్ సచ్‌దేవ్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Loading...
Unable to load recommendations.
Follow Us