ఇప్పటికీ ఆయన బాలుడే..!

ఆయన ఎప్పటికీ బాలుడే... ఎన్నేళ్లు నిండినా సరే ఇంకా బాలుడే... అందుకే ఆ గొంతులో మాధుర్యం అలాగే ఉంది... ఆ పాటలో ప్రతిభ కొంచెమైనా తగ్గలేదు... ఆ మాటల్లో చమత్కారం ఇసుమంతైనా తరగలేదు.

ఇప్పటికీ ఆయన బాలుడే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 04, 2020 | 1:41 PM

ఆయన ఎప్పటికీ బాలుడే… ఎన్నేళ్లు నిండినా సరే ఇంకా బాలుడే… అందుకే ఆ గొంతులో మాధుర్యం అలాగే ఉంది… ఆ పాటలో ప్రతిభ కొంచెమైనా తగ్గలేదు… ఆ మాటల్లో చమత్కారం ఇసుమంతైనా తరగలేదు. పాటగాడిగానే కాదు… ఉత్తమ వక్తగా.. మంచి నటుడిగా… చక్కటి సంగీత దర్శకుడిగా… అభిరుచి ఉన్న నిర్మాతగా… డబ్బింగ్‌ ఆర్టిస్టుగా… సంగీత కార్యక్రమ నిర్వహకుడిగా… ఇన్నేసి మాటలెందుక్కాని… బహుముఖ ప్రతిభ కనబరుస్తూ వినసొంపునిస్తున్న ఆయనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం… ముద్దుగా బాలు… ఇవాళ ఆయన జన్మదినం… పాత తరానికీ .. కొత్త తరానికీ సంధానకర్తగా పాటల ప్రపంచంలో అడుగుపెట్టిన ఆ గాయక శ్రేష్టుడు తెలుగుపాటలో కొత్త ఒరవడులు సృష్టించారు.. సినీ సంగీతాన్ని పరవళ్లు తొక్కించారు.. నిజానికి గాయకులు కాలానికి అతీతులు కారు.. ఎంత గొప్ప పాటగాడైనా కొంతకాలానికి పాతబడిపోతాడు.. విన్న గొంతునే వినిపిస్తూ శ్రోతలకు విసుగు కలిగిస్తాడు.. కానీ బాలు సంగతి వేరు.. ఆయన దశకంఠుడు.. ఆ మాటకొస్తే శతకంఠుడు… సహస్రకంఠుడూనూ..! ఆ గొంతు ఇప్పటికీ పాతపడలేదు.. ఎన్నిసార్లు విన్నా ఆ స్వరంలో ఏదో కొత్తదనం వినిపిస్తుంది.. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో బాలు ఎప్పటికీ ఓ స్టాండర్డ్ గా నిలిచిపోవడానికి కారణం… తొలినాళ్లలో పడిన బలమైన పునాది.. తిరుగులేని కృషి… బాలు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించలేదు.. అయితేనేం విన్న వెంటనే బాణీ పట్టేసే అద్భుతమైన ప్రతిభ ఆయనది… అనుభవమే ఆయనకు సంగీత పాఠాలు నేర్పింది.. అందుకే అలవోకగా అన్నేసి పాటలు అందరికీ పాడగలిగారు.. పాడుతూ ఉండగలిగారు.. కఠినమైన పదబంధాలతో సాగే పాటలనైనా సింగిల్‌ టేక్‌లో ఓకే చేయగల సమర్థుడు కాబట్టే మ్యూజిక్‌ డైరెక్టర్లకు ఇష్టుడయ్యారు… రచయితలూ సంతుష్టులయ్యారు.. నాలుగు తరాల హీరోలకు పాటలు పాడే అవకాశం ఎంతమంది గాయకులకు లభిస్తుంది చెప్పండి..? ఆ అదృష్టం ఒక్క బాలుకే దక్కింది… ప్రపంచంలో మరే గాయకుడికీ దక్కని అరుదైన వరమిది..అలాగని స్వరంలో మాధుర్యమేమైనా తగ్గిందా ..ఊహూ…అదే తీయదనం…అదే ఆయన గొప్పదనం… బాలుది ఓ ప్రత్యేకమైన శైలి… ఎవరినీ అనుకరించని ఓ విశిష్టమైన బాణి… ఈ క్వాలిటీలే ఆ గాన గంధర్వుడికి పాటల పట్టాభిషేకాన్ని చేసి పెట్టాయి…కేవలం టాలెంట్ తో అన్నిటా నెగ్గుకొస్తూ సినీ సంగీత ఆకాశంలో నెలబాలుడిలా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చారు. బాలుడిగా ఉన్నప్పుడే బాలు బహుముఖ ప్రతిభ వికసించింది. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా దక్షిణ భారతపు నాలుగు భాషల్లోనూ తన పాటల పిట్టలను విహరింపచేశారు. ఏ పాట పాడినా సహజంగా ఉండాలి. ఏ భాష మాట్లాడినా అది మాతృ భాషలా ఉండాలి. ఇదీ బాలు సిద్ధాంతం. అందుకే ఎంతో కృషి చేశారు. ప్రతి భాష ఉచ్చారణలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఇదే ఆయన్ను అందరివాణ్ని చేసింది. తెరముందు ఎందరు హీరోలున్నా… తెర వెనుక ఒకడే హీరో… బాలు! హీరోలకి పాడారు. కమెడియన్లకి పాడారు. ఒక్కో హీరోకి ఒక్కోలా పాడారు. ఒక్కో కమెడియన్ కి ఒక్కోలా ఆలపించారు. వంద కంఠాలతోనైనా పాడగలిగే అద్భుత ప్రతిభాశాలి… అయినా బాలు నిగర్వి. ప్రతిభనీ వినయాన్నీ అనులోమానుపాతంలో పెంచుకున్న వినయశీలి. ఆకాశమంత ఎత్తు ఎదిగినా … తనకి ఏమీ రాదని చెప్పే నిరహంకారం ఎవరికోగానీ సాధ్యం కాదు. ఒకోసారి… ఆ మాటకొస్తే ఒకోసారి ఈయన తనని తాను మరీ తక్కువ చేసుకుంటున్నాడేమో అనీ డౌటొస్తుంది. బాలు లాంటి గాయకుడు … భారతదేశం మొత్తం వెతికినా దొరకడు. భారతదేశమే కాదు… ప్రపంచంలోనే అలాంటి సింగర్ లేడనడానికి మొహమాటపడాల్సిన పని లేదు. గాయకుడిగా కంటే… మంచిమనిషిగా బాలునే చెప్పుకోవాలంటారు కొందరు. అందుకే పద్మశ్రీల్లాంటి కిరీటాలూ, డాక్టరేట్ల లాంటి డాబుసరి బిరుదాలూ బాలు ప్రతిభకీ, వ్యక్తిత్వానికీ ఎంతమాత్రం వెలకట్టలేవు. ఈ బాలుడు మరిన్ని కాలాలపాటు మధురమైన సంగీతంతో మనకి వీనులవిందు చేయాలనీ… మంచి మనిషిగా జీవితాన్ని మధురంగా గడపాలనీ కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే బాలూగారూ!

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?