Megastar Chiranjeevi: ఆ ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. అతిధిగా ఆ స్టార్ హీరో.. ?

మెగాస్టార్ చిరంజీవి మరోసారి హోస్ట్ గా మారనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మెగావర్స్ పేరుతో రానున్న ఆ టాక్ షో షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుందని సమాచారం. అయితే తాజాగా మెగాస్టార్ టాక్ షో గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

Megastar Chiranjeevi: ఆ ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. అతిధిగా ఆ స్టార్ హీరో.. ?
Chiranjeevi Talk Show

Updated on: Oct 29, 2026 | 3:56 PM

మెగాస్టార్ చిరంజీవి ఎనర్జీ, క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దుమ్మురేపుతున్నారు. ఇక ఇప్పుడు హోస్ట్ గా మారబోతున్నారు చిరు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కోసం ఆయన హోస్టుగా మారబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. మెగావర్స్ పేరుతో సెలబ్రెటీ టాక్ షో చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. తాజాగా ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చేసింది నెట్ ఫ్లిక్స్. “మాస్ కి గ్రామర్, స్టైల్ కి డిఫినేషన్ మెగాస్టార్ ఇక్కడ. చిరంజీవి మెగావర్స్ త్వరలోనే మీ నెట్ ఫ్లిక్స్ లో” అంటూ అధికారికంగా వెల్లడించింది నెట్ ఫ్లిక్స్. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ఈ టాక్ షోను దాదాపు 12 నుంచి 15 ఎపిసోడ్స్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు సెలబ్రెటీలు గెస్టులుగా రాబోతున్నారట. ఇప్పటికే ఒక ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తైంది. అన్నపూర్ణ స్టూడియోల్ స్పెషల్ గా నిర్మించిన సెట్ లో చిత్రీకరణ చేస్తున్నారట. అయితే బ్రహ్మానందం, సునీల్, సత్యలతో ఒక ఎపిసోడ్ షూటింగ్ జరిగిందని టాక్. ఇక ఈ ఎపిసోడ్ లో బోలెడంత కామెడీతోపాటు ఆసక్తికర విషయాలు సైతం చర్చించారట.

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

ఇదిలా ఉంటే.. మెగావర్స్ ఫస్ట్ అతిథిగా లోకనాయకుడు కమల్ హాసన్ రానున్నట్లు సమాచారం. తాజాగా కమల్ హైదరాబాద్ రావడంతో అసలు ఈ షూట్ కోసమే వచ్చారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ కమల్ మెగావర్స్ కోసమే వచ్చి ఉంటే ఇద్దరు లెజెండ్స్ ఒకే స్క్రీన్ పై కనిపించడం ఖాయమని తెలుస్తోంది. ఈ షోకు సంబంధించిన వివరాలను నెట్ ఫ్లిక్స్ త్వరలోనే ప్రకటించనుంది.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

నెట్ ఫ్లిక్స్ పోస్ట్..

చిరంజీవి, కమల్ హాసన్..

Chiranjeevi, Kamal Haasan

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

Loading...
Unable to load recommendations.
Follow Us