మీ వ్యక్తిత్వం నా మనసును కదిలించిందమ్మా.. మహిళా పోలీస్‌పై చిరు ప్రశంసలు..!

మీ వ్యక్తిత్వం నా మనసును కదిలించిందమ్మా.. మహిళా పోలీస్‌పై చిరు ప్రశంసలు..!

ఓ మహిళా పోలీస్ వ్యక్తిత్వం తన మనసును కదిలించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అంతేకాదు ఆ అధికారిణితో వీడియో కాల్‌లో మాట్లాడిన చిరు..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 12, 2020 | 5:38 PM

ఓ మహిళా పోలీస్ వ్యక్తిత్వం తన మనసును కదిలించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అంతేకాదు ఆ అధికారిణితో వీడియో కాల్‌లో మాట్లాడిన చిరు.. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఒడిశాకు చెందిన పోలీస్ అధికారిణి శుభశ్రీ కొన్ని రోజుల క్రితం మతి స్థిమితం సరిగా లేని ఓ మహిళకు భోజనం తినిపించారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారి.. చిరు దగ్గరకు చేరింది. దాన్ని చూసి చలించిపోయిన మెగాస్టారు.. ఆమె వివరాలు కనుక్కొని వీడియో కాల్ చేశారు.

మతి స్థిమితం సరిగా లేని ఓ మహిళను మీరు భోజనం తినిపిస్తున్న వీడియో చూశాను. అది నా మనసుకి తాకింది. ఆ రోజు నుంచి మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా. ప్రజలను మీరు సొంత వారిగా చూసే విధానం నన్ను చలింపజేసింది. ఓ వ్యక్తి పట్ల అంత ఆదరణ ఉన్నందుకు మీకు కృతఙ్ఞతలు తెలియజేయాలనుకున్నా. మీలో ఓ సానుభూతితో నిండిన తల్లి హృదయాన్ని చూశాను అని ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా శుభశ్రీ.. చిరుకు ధన్యవాదాలు తెలిపారు.

Read This Story Also: గుంటూరులో అర్ధరాత్రి దారుణం.. డబ్బు కోసం వ్యాపారి హత్య..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu