స్టైలిష్ స్టార్ బర్త్‌డే.. వెల్లువెత్తుతోన్న శుభాకాంక్షలు

| Edited By:

Apr 08, 2019 | 4:31 PM

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరో, హీరోయిన్లతో పాటు నిర్మాణ సంస్థలు కూడా ఆయనకు తమ అభినందనలు తెలుపుతున్నారు. హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్. ఈ సంవత్సరం నీకు మరింత ఆనందంగా ఉండాలి- సుకుమార్ See more సదరన్ స్టార్, దర్శకుల హీరో, మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు మరిన్ని విజయాలను […]

స్టైలిష్ స్టార్ బర్త్‌డే.. వెల్లువెత్తుతోన్న శుభాకాంక్షలు
Follow us on

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరో, హీరోయిన్లతో పాటు నిర్మాణ సంస్థలు కూడా ఆయనకు తమ అభినందనలు తెలుపుతున్నారు.

హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్. ఈ సంవత్సరం నీకు మరింత ఆనందంగా ఉండాలి- సుకుమార్

సదరన్ స్టార్, దర్శకుల హీరో, మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నా- హరీశ్ శంకర్

స్టైలిష్, హార్ట్ వర్కింగ్ హీరో అల్లు అర్జున్‌కు హ్యాపీ హ్యాపీ బర్త్‌డే. ఐకాన్ పోస్టర్‌ చాలా బావుంది బ్రదర్- నిఖిల్

నాకు ఇష్టమైన ఫ్రెండ్, బ్రదర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్‌డే. మమ్మల్ని ఎప్పుడూ ఎంటర్‌టైన్‌చేస్తూ ఉండు. లవ్ యు- దేవీ శ్రీ ప్రసాద్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే- సాయి ధరమ్ తేజ్

అల్లు అర్జున్ సర్. హ్యాపీయెస్ట్ బర్త్‌డే సర్. మమ్మల్ని ఎప్పుడూ సపోర్ట్ చేసే మీకు థ్యాంక్స్. మీతో పనిచేసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా- రష్మిక మందన్న

నా ఫేవరెట్ పర్సన్ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే. మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. మీ ఎనర్జీని ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలి- రకుల్ ప్రీత్ సింగ్

నా పెద్ద అన్న, నా ఫేవరెట్ హీరోకు హ్యాపీ బర్త్‌డే టు. నేను చేసే ప్రతి పనిలో నాకు సహాయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్- అల్లు శిరీశ్

హ్యాపీ బర్త్‌డే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఈ సంవత్సరం మీకు మరిన్ని విజయాలు చేకూరాలి- గోపిచంద్ మలినేని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి హ్యాపీ బర్త్‌డే- వెన్నెల కిశోర్

అల్లు అర్జున్‌కు హ్యాపీ హ్యాపీ బర్త్‌డే. మీ టాలెంట్‌తో మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీకు దేవుడు మరిన్ని బ్లాక్‌బస్టర్లు ఇవ్వాలని కోరుకుంటున్నా- లావణ్య త్రిపాఠి

మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే- సుధీర్ వర్మ

కాగా బన్నీ ప్రస్తుతం మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘నా పేరు సూర్య’ తరువాత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న బన్నీ.. మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వనున్నాడు.