Sonu Sood : రియల్ హీరోకి షాక్ ఇచ్చిన ముంబై హైకోర్టు.. సోనూసూద్ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం

నటుడు సోనూసూద్  లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల పాలిట దైవంగా మారిన విషయం తెలిసిందే.. రీల్ విలన్ కాస్తా రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్...

Sonu Sood : రియల్ హీరోకి షాక్ ఇచ్చిన ముంబై హైకోర్టు.. సోనూసూద్ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం

Updated on: Jan 22, 2021 | 5:38 AM

Sonu Sood : నటుడు సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల పాలిట దైవంగా మారిన విషయం తెలిసిందే.. రీల్ విలన్ కాస్తా రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. దేశం మొత్తం సోనూసూద్ సేవలను మెచ్చుకుంది. ఎన్నో అరుదైన అవార్డులు సోనూసూద్ ని వరించాయి. కాగా ముంబైలోని ఓ భవనాన్ని హోటల్ గా మార్చిన విషయం తెలిసిందే.. అయితే దీనిపై మునిసిపాలిటీ పర్మిషన్ తీసుకోలేదని సోనూసూద్ పై వచ్చిన అభియోగం.

కాగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా భవనాన్ని హోటల్ గా మార్చారని ఫిర్యాదులో పేర్కొంది బీఎంసీ. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తనపై వేసిన కేసును కొట్టేయాలని సోనూ కోర్టును ఆశ్రయించగా.. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.  సోనూ సూద్ పిటిషన్ను బాంబేే హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి పృథ్వీరాజ్ చవాన్ కొట్టివేశారు. నివాస భవనాన్ని హోటల్ గా  మార్చేందుకు బీఎంసీ నుంచి ‘చేంజ్ ఆఫ్ యూజర్’ అనుమతులు తీసుకున్నానని స్పష్టం చేశాడు సోనూ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sushant Singh Rajput : ఢిల్లీలోని రోడ్డుకు దివంగత నటుడి పేరు.. ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మార్గ్ ‘ గా నామకరణం

 

 

Follow Us