బాలీవుడ్లో ఫిట్నెస్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే నటీమణుల్లో శిల్పాశెట్టి ఒకరు. తరచుగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫిట్నెస్ వీడియోలను పంచుకుంటుంది శిల్పా శెట్టి. యోగాసనాల గురించి తెలియజేస్తూ ఫిట్ నెస్ ప్రాముఖ్యతను నేటి యువతకు తెలియజేస్తూ ఉంటుంది. మోటివేషన్ పోస్ట్‌లను షేర్ చేస్తుంది. అయితే శిల్పా శెట్టి షేర్ చేసే యోగాసనాల్లో కొన్ని సంప్రదాయ భంగిమలు అయితే.. మరికొన్ని తన భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో శిల్పా శెట్టి డాగ్ బర్డ్ పోజుని షేర్ చేసింది. పక్షి-కుక్క భంగిమను పంచుకుంటూ, శిల్పా .. “నేను సెట్లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి సాకులు చెప్పకుండా యోగా శిక్షణ కొనసాగిస్తానని పేర్కొంది. “తాను తాజాగా షేర్ చేసిన యోగా భంగిమ ఉద్యోగం చేస్తూ చాలా బిజీగా ఉన్న వారి కోసం అని చెప్పింది. ఈ ప్రత్యేక వ్యాయామాన్ని ‘బర్డ్-డాగ్’ భంగిమ అంటారు. ఇది కండరాలు, పిరుదులు, భుజాలు, చేతులను బలపరుస్తుంది. ఇది సమతుల్యతను మెరుగుపరుస్తుంది.
తాను పనిలో బిజీగా ఉన్నప్పటికీ యోగాను కొనసాగిస్తున్నట్లు శిల్పాశెట్టి తెలిపింది. వ్యాయామానికి దూరంగా ఉండటానికి ఎవరైనా చెప్పే సాకు బిజీ బిజీ అని అంటారు. అయితే తాను తన వ్యాయామం చేయడానికి బిజీ అనే మాటను సాకుగా చూపానని పేర్కొంది. శిల్పా కు ఫిట్‌నెస్‌పై ఉన్న ఈ మక్కువ చూసి శిల్పా అభిమానులు కూడా చాలా ఉత్సాహం చూపిస్తారు. కొందరు శిల్పా యోగాసనాలను అభ్యసిస్తారు.
శిల్పా శెట్టి తాజాగా షేర్ చేసిన పక్షి-కుక్క భంగిమ వ్యాయామ భంగిమ భుజాలు, చేతులను బలపరుస్తుంది. అయితే పక్షి-కుక్క భంగిమ ఏమిటి? ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
బర్డ్ డాగ్ అనేది శరీర సమతుల్యతను మెరుగుపరిచే ఒక సాధారణ కోర్ వ్యాయామం. ఇది వెన్నెముకకు చాలా మంచిది. ఈ వ్యాయామం నడుము నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ వ్యాయామం భంగిమ.. తుంటి , వెనుక కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. పక్షి-కుక్క యోగా పోజులో మొత్తం శరీరం ఉపయోగించబడుతుంది. ఈ యోగా పోజు వృద్ధులతో సహా అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వెన్నెముకను సరిచేయడానికి, నడుము నొప్పిని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
బర్డ్ డాగ్ పోజ్ ఎలా చేయాలో తెలుసుకోండి
బర్డ్ డాగ్ వ్యాయామం ప్రయోజనాలు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..