Yo Yo Honey Singh: ప్రముఖ బాలీవుడ్ సింగర్‌పై గృహహింస కేసు.. నోటిసులు జారీ చేసిన కోర్టు..

ప్రముఖ బాలీవుడ్ సింగర్, ర్యాపర్ యోయో హనీసింగ్‌పై గృహహింస కేసు నమోదైంది. లైంగికంగా, మానసికంగా వేధించడమే కాకుండా..

Yo Yo Honey Singh: ప్రముఖ బాలీవుడ్ సింగర్‌పై గృహహింస కేసు.. నోటిసులు జారీ చేసిన కోర్టు..
Yo Yo Honey Singh

Updated on: Aug 04, 2021 | 6:06 AM

ప్రముఖ బాలీవుడ్ సింగర్, ర్యాపర్ యోయో హనీసింగ్‌పై గృహహింస కేసు నమోదైంది. తనని లైంగికంగా, మానసికంగా వేధించడమే కాకుండా.. ఆర్ధికంగా కూడా మోసం చేశాడంటూ అతడి భార్య షాలిని తల్వార్ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ‘గృహ హింస నుంచి మహిళల రక్షణ’ చట్టం కింద పిటిషస్‌ను దాఖలు చేసింది.

షాలిని తల్వార్ వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. హనీసింగ్‌కు నోటిసులు జారీ చేసింది. ఆగష్టు 28లోగా వివరణ ఇవ్వాలంటూ కోరింది. ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన లావాదేవీల జోలికి వెళ్లొద్దని చెబుతూ.. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, దాదాపు ఏడేళ్ల క్రితం ‘India’s Raw Star’ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ తన భార్య షాలిని తల్వార్ సింగ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!

Loading...
Unable to load recommendations.
Follow Us