Aishwarya Rai : ముద్దు గురించి ముచ్చటిస్తున్న ఐశ్వర్యారాయ్.. ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు..!

Aishwarya Rai in Oprah Winfrey Show : ఓఫ్రా విన్‌ఫ్రే సెలెబ్రిటీ చాట్ షో వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు

Aishwarya Rai : ముద్దు గురించి ముచ్చటిస్తున్న ఐశ్వర్యారాయ్.. ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు..!
Aishwarya Rai

Updated on: Mar 15, 2021 | 3:22 PM

Aishwarya Rai in Oprah Winfrey Show : ఓఫ్రా విన్‌ఫ్రే సెలెబ్రిటీ చాట్ షో వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొంటారు. అయితే అమితాబచ్చన్ కోడలు, అభిషేక్ భార్య అయిన అందాల ఐశ్వర్యరాయ్ ఈ షోలో పాల్గొంది. ఇందులో భాగంగా పలు నగ్న సత్యాలను ఆమె వెల్లడించింది. కాగా షోలో సెక్సువాలిటీ, పబ్లిక్ కిస్, అరేంజ్డ్ మ్యారేజెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్కిన్ కలర్, ఇండియాలో అమెరికన్ మహిళల పట్ల అవగాహన వంటి అంశాలపై నేర్పుగా సమాధానమిచ్చింది ఐశ్వర్య.

పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం గురించి ఓఫ్రా విన్‌ఫ్రే ప్రశ్నించగా.. ఇండియాలో ప్రజలు ముద్దుపెట్టుకుంటారు కానీ, ఏ వీధి మూలనో జరగదు. ఇది మరింత గోప్యమైన భావవ్యక్తీకరణ అని పేర్కొన్నారు. ఓఫ్రా ‘సెక్స్.. అవుట్ ఆఫ్ మ్యారేజ్’ నిషిద్ధమా అని అడగ్గా, ‘నిజం చెప్పాలంటే ఇది మంచి పని కాదు’ అని బదులిచ్చింది. అంతేకాదు విదేశాల్లో చదువుకుంటేనే ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడగలమన్న ప్రజల భావన నిజంగా బాధేస్తుందని తెలిపింది.

ఇక అర్బన్ ఇండియాలో అరేంజ్డ్ మ్యారేజెస్ గ్లోబల్ డేటింగ్ సర్వీస్‌ను పోలి ఉంటాయని వివరించింది ఐశ్వర్య. అమ్మాయి, అబ్బాయికి చెందిన కుటుంబాలు.. వారి బ్యాక్‌గ్రౌండ్ స్టడీ చేసి ఇద్దరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి నిశ్చితార్థం చేస్తారని, తర్వాత పెళ్లి ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. ముప్పై ఏళ్లు వచ్చేసరికి యూఎస్‌లో పేరెంట్స్ తమ పిల్లలను బయటకు నెట్టేస్తారు కానీ ఇండియాలో అలా కాదు. ఇది కుటుంబానికి, వారి మధ్య ఉండే ప్రేమలకు మధ్య సున్నితమైన విషయం అని చెప్పింది. బహుశా భారతదేశం యొక్క గొప్పతనం కావొచ్చని పేర్కొంది.

AIIMS Recruitment: నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్ష మొదలు రెండు లక్షల వరకు.. దరఖాస్తు చేసుకోండిలా..

Photo Gallery: నేడే బుమ్రా-సంజనా గణేశన్ వివాహం.. ఆమె గురించి కొన్ని విశేషాలు మీకోసం