
ఇటీవల గత కొంత కాలంగా.. సౌత్ ఇండియన్ సినిమాలపై బాలీవుడ్ నిర్మాతల దృష్టి పడింది. దక్షిణాది సూపర్ హిట్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేయడానికి మేకర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. బీటౌన్‌లో ఇప్పుడు ఎక్కువగా సొంత స్టోరీ చిత్రాల కంటే.. ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు టాప్ డైరెక్టర్స్. ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయిన “అర్జున్ రెడ్డి” సినిమాను హిందీలో “కబీర్ సింగ్” పేరుతో రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు షాహిద్ కపూర్. అలాగే న్యాచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” మూనీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో దక్షిణాది సూపర్ హిట్ చిత్రం హిందీలోకి రీమేక్ కానుంది. అదే తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన “ఆకాశమే నీ హద్దురా” మూవీ.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సుధ కొంగర తమిళంలో శూరరై పోట్రు పేరుతో రూపొందించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో డబ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. 93వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌కు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సూర్య మూవీ హిందీలోకి రీమేక్ కానుంది. ఈ విషయాన్ని హీరో సూర్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు.. ఈ మూవీతో నిర్మాతగా సూర్య హిందీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో రక్త చరిత్ర-2 వంటి సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య .. ఇప్పుడు నిర్మాతగా బీటౌన్‌లో రాణించాలనుకుంటున్నాడు. మరీ బాలీవుడ్లో సూర్య పాత్రలో ఎవరు నటిస్తారనేది చూడాలి.
సూర్య ట్వీట్..
Also Read: Allu Arjun: మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న బన్నీ.. బోయపాటి డైరెక్షన్లో అల్లు అర్జున్ సినిమా ?