
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్.. యంగ్ క్రికెటర్ శుభ్మాన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరు ఓ రెస్టారెంట్లో కలిసున్న ఫోటోస్ వైరల్ కావడంతో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ విషయంపై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి కెమెరాకు చిక్కారు. సారా, శుభ్మాన్ ఒకే హోటల్ నుంచి బయటకు వస్తున్న ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు..వీరు ఒకే ఫ్లైట్ ఎక్కినట్లుగా తెలుస్తోంది. నెట్టింట వైరలవుతున్న వీడియోలో ముందుగా సారా హోటల్ నుంచి బయటకు రాగా.. ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే శుభ్మాన్ గిల్ బయటకు రావడం కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణించినట్లుగా సమాచారం.
అయితే సారా అలీ ఖాన్ డేటింగ్ రూమర్స్ రావడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఆమె హీరో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల తనకు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందని కాఫీ విత్ కరణ్ 7షోలో బయటపెట్టింది సారా. మరోవైపు.. శుభ్మాన్ గిల్.. స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం సారా అలీ ఖాన్, శుభ్మాన్ గిల్ కలిసి ప్రయాణిస్తున్న వీడియో వైరల్ కావడంతో..వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. వీరు ప్రేమలో ఉన్నారు అనడానికి ఈ సాక్ష్యం సరిపోదా ?.. బాలీవుడ్.. క్రికెట్ ది విడదీయరాని బంధం. మళ్లీ కలిసి కనిపించారు అంటే ప్రేమలో ఉన్నారనే అర్థం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.