
Sonu Sood : సోనూసూద్.. కరోనా కష్టకాలంలో బాగా వినిపించిన ఈ పేరు ఇది. ప్రభుత్వాలను మించి పెద్దమనసుతో పేదలకు సాయం అందించడానికి ముందుకు వచ్చాడు సోనూసూద్. కరోనా కారణం గా వింధించిన లాక్ డౌన్ వల్ల వేలాది మంది కార్మికులు గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న సమయంలో వారిపాలిట దేవుడు అయ్యాడు. బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి కార్మికులను తమ గ్రామాలకు చేర్చి వారి కన్నీళ్లు తుడిచాడు. అంతటితో సోను సాయం ఆగిపోలేదు. వేదికగా సాయం కోరిన ప్రతిఒక్కరికి తనవంతు సహాయం అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశనలుమూలలనుంచి ఎవరు సాయం కోరిన సోనూసూద్ చేస్తూ వచ్చారు. సోను పెద్ద మనసుకు ఎన్నో అవార్డులు.. దేశమంతటా ప్రశంసలు దక్కాయి.
ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా సోనూ సూద్ చేసిన సాయం వల్ల బెంగళూరులో 22 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఈ విషయం పై ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ స్పందిస్తూ.. సోనూసూద్ సేవలను కొనియాడారు. ఎంతో మందికి సోను స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని ప్రశంసించారు. సాయం కోరిన ప్రతి ఒక్కరికీ అండగా నిలిచేందుకు యత్నిస్తున్నారని కితాబునిచ్చారు. అంతే కాదు సోనూకు దేవుడి దయ ఉండాలని, మరిన్ని సేవలు చేస్తూ మరింత పేరు సంపాదించాలని కోరుకున్నారు మాధవన్. ఈ మేరకు మాధవన్ ట్విట్టర్లో ట్వీట్ చేసారు.
ఆర్ మాధవన్ ట్వీట్…
మరిన్ని ఇక్కడ చదవండి :