Toofaan: ప్రేయసి కోసం వీది రౌడీ నుంచి ప్రొఫెషనల్ బాక్సర్ గా.. తుఫాన్ మూవీ ట్రైలర్

|

Jun 30, 2021 | 2:49 PM

బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ నటిస్తున్న  తుఫాన్. తుఫాన్ సినిమాలో ఫరాన్ అక్తర్ బాక్సర్ గా కనిపించనున్నాడు.

Toofaan: ప్రేయసి కోసం వీది రౌడీ నుంచి ప్రొఫెషనల్ బాక్సర్ గా.. తుఫాన్ మూవీ ట్రైలర్
Farhan Akhtar
Follow us on

Toofaan:

బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ నటిస్తున్న  తుఫాన్. తుఫాన్ సినిమాలో ఫరాన్ అక్తర్ బాక్సర్ గా కనిపించనున్నాడు. పర్హాన్ అక్తర్ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడతాడని తెలుసు. ఎందుకంటే గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’తో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.ఇప్పటివే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రేమలో పడిన తర్వాత ఓ స్ట్రీట్ ఫైటర్.. జాతీయ స్థాయి బాక్సర్ గా ఎలా మారాడు అనే కథాంశంతో సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. హీరో చేసిన తప్పు వల్ల ఐదేళ్లు బాక్సింగ్ నుంచి బ్యాన్ చేయడం.. మళ్ళీ అతను బాక్సింగ్ చేయాలని ప్రేయసి కోరుకోవడం.. దాని కోసం అతడు కష్టపడటం ట్రైలర్ లో చూపించారు. ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి ఫర్హాన్ అక్తర్ భారీ వర్కవుట్స్ చేసారు. గతంలో ఫర్హాన్ అక్తర్ కష్టం పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం సమకూర్చారు. జై పినక్ ఓజా సినిమాటోగ్రఫీ  అందించారు. ఈ ట్రైలర్ పైన మీరు ఓ లుక్కేయండి..

మరిన్ని ఇక్కడ చదవండి :

Sivakarthikeyan’s Doctor: డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ కానున్న ‘డాక్టర్’ సినిమా..

Akshay-Rakul : బాలీవుడ్ లో వరస అవకాశాలను అందుకుంటున్న రకుల్.. అక్షయ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్

Avika Gor Birthday special: వానలో తడుస్తూ… చిందులేస్తున్న అందాల అవికా..