Disha Patani: దిశా పటాని సిస్టర్ గురించి తెలిస్తే షాకే.. 12 ఏళ్లు ఇండియన్ ఆర్మీలో సేవలు.. ఇప్పుడు..

ప్రస్తుతం మోస్ అవైటెడ్ కల్కి సినిమాలో నటిస్తుంది. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలలో నటిస్తుడంగా... కీలకపాత్రలో దిశా కనిపించనుంది. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న దిశా పటాని.. తన పర్సనల్ లైఫ్ గురించి తక్కువగా పంచుకుంటుంది. ఆమెకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు.

Disha Patani: దిశా పటాని సిస్టర్ గురించి తెలిస్తే షాకే.. 12 ఏళ్లు ఇండియన్ ఆర్మీలో సేవలు.. ఇప్పుడు..
Disha Patani
Follow us

|

Updated on: Apr 23, 2024 | 6:25 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో దిశా పటాని ఒకరు. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతె తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎమ్ ఎస్ ధోని సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో వరుస సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాల ప్రదర్శన గురించి తెలిసిందే. ఎప్పుడూ గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ వైరలవుతుంటుంది. ప్రస్తుతం మోస్ అవైటెడ్ కల్కి సినిమాలో నటిస్తుంది. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలలో నటిస్తుడంగా… కీలకపాత్రలో దిశా కనిపించనుంది. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న దిశా పటాని.. తన పర్సనల్ లైఫ్ గురించి తక్కువగా పంచుకుంటుంది. ఆమెకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. అయితే ప్రస్తుతం దిశా పటాని అక్క సైతం సోషల్ మీడియా చాలా యాక్టివ్. దేశం కోసం ఎన్నో సంవత్సరాలు ఆర్మీలో సేవలు చేసింది. ఇప్పుడు నెటిజన్లకు ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇస్తుంది.

దిశా పటాని అక్క పేరు ఖుష్బూ పటాని. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆమె.. దేశానికి సేవ చేయాలని ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యింది. సాదరణ స్థాయిలో జవాన్ గా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత మేజర్ స్థాయికి ఎదిగింది. లెఫ్టినెంట్ హోదాలో పనిచేసింది. దాదాపు 12 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసింది. కేవలం ఆర్మీ జవాన్ మాత్రమే కాకుండా ఖుష్బూ న్యూట్రిషియన్ ట్రైనర్. గతేడాది ఆర్మీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకన్న ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ హెల్త్ టిప్స్, యోగా, వ్యాయామం టిప్స్ చెప్తుంది.

ఖుష్బూ పటాని నిత్యం ఫిట్నెస్ గురించి టిప్స్ చెబుతుంది. ఖుష్బూ పటాని 1991 నవంబర్ 23న ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జన్మించింది. బరేలీలోని BBL పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసింది. ఆమె DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 12వ తరగతి పూర్తి కాగానే ఆమె ఆర్మీలో జాయిన్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles