పురుషుడి ప్రైవేట్ పార్ట్‌పై శాస్త్రవేత్త కామెంట్.. వ్యంగ్యంగా రియాక్ట్ అయిన బాలీవుడ్ భామ.!

|

Mar 27, 2021 | 5:40 PM

Dia Mirza Tweet: అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ నాటి దియా మిర్జా. ఫిబ్రవరి నెలలో ప్రముఖ వ్యాపారవేత్త..

పురుషుడి ప్రైవేట్ పార్ట్‌పై శాస్త్రవేత్త కామెంట్.. వ్యంగ్యంగా రియాక్ట్ అయిన బాలీవుడ్ భామ.!
Dia Mirza
Follow us on

Dia Mirza Tweet: అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ నాటి దియా మిర్జా. ఫిబ్రవరి నెలలో ప్రముఖ వ్యాపారవేత్త వైభ్ రేఖిని వివాహమాడిన ఈ అందాల భామ… ప్రస్తుతం మాల్దీవులలో హాలిడేను ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా దియా మిర్జా చేసిన ఓ ట్వీట్ బీ-టౌన్‌లో హాట్ టాపిక్ అయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

అసలు ట్వీట్ ఏంటి..?

వాతావరణంలో ఉన్న విష రసాయనాలు స్పెర్మ్ కౌంట్, వృషణాలపై ప్రభావితం చూపుతున్నాయని.. అందుకే కాలుష్యం వల్ల పురుషుల జననాంగ పరిణామం తగ్గిపోతోందంటూ డాక్టర్ షన్నా స్వాన్ అనే శాస్త్రవేత్త తన బుక్‌లో రాసుకోగా.. దాని గురించి ప్రస్తావిస్తూ జాతీయ మీడియా ‘స్కై న్యూస్’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై బాలీవుడ్ నటి దియా మిర్జా వ్యంగ్యంగా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయింది.

దియా మిర్జా వ్యంగ్యంగా కౌంటర్..!

ఆ ట్వీట్‌ను రీ-ట్వీట్ చేసిన బాలీవుడ్ నాటి దియా మిర్జా ” ఇప్పటికైనా ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులు, గాలి కాలుష్యంపై సీరియస్‌గా దృష్టి సారిస్తాయంటూ” పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా, అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో దియా మిర్జా ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Also Read:

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

హైదరాబాద్‌లో హోళీ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలే.!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!