Chakda Xpress: నటి అనుష్క శర్మ రాబోయే చిత్రం ‘చక్దా ఎక్స్‌ప్రెస్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దాదాపు మూడేళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు రానుండడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎన్నో రోజులుగా ఈ సినిమాపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి విషయం కూడా బయటకు రాలేదు. ఈరోజు (గురువారం) ఈ సినిమాపై ఓ ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని స్వయంగా అనుష్కే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ట్విట్టర్లో విడుదల చేసింది.
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌గా రానున్న ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ సినిమాపై ఆశలు భారీగానే ఉన్నాయి. ప్రతీక్షారావు దర్శకత్వంలో నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీ(OTT) ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. దీని షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఎప్పుడు విడుదల చేస్తారో మాత్రం ప్రకటించలేదు. కర్నేష్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అనుష్క మూడేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
It is a really special film because it is essentially a story of tremendous sacrifice. Chakda Xpress is inspired by the life and times of former Indian captain Jhulan Goswami and it will be an eye-opener into the world of women’s cricket. pic.twitter.com/eRCl6tLvEu
— Anushka Sharma (@AnushkaSharma) January 6, 2022
Also Read: Radhe Shyam: రాధేశ్యామ్ న్యూ రిలీజ్ డేట్ ఇదే.. మేకర్స్ చూపు అటు వైపే.. నెట్టింట్లో టాక్..
Aha: ఆహాలో సరికొత్త వినోదం.. జనవరిలో అలరించనున్న షోస్.. సినిమాలు ఇవే..