Shah Rukh Khan: షూటింగ్‏లో షారుఖ్‏కు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‏లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ సీన్‏లో గాయమైందట.. దీంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ఆయనకు పెద్దగా ప్రమాదం లేదని... మైనర్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారని సమాచారం.

Shah Rukh Khan: షూటింగ్‏లో షారుఖ్‏కు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..
Shah Rukh Khan

Updated on: Jul 04, 2023 | 3:16 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‏లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ సీన్‏లో గాయమైందట.. దీంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ఆయనకు పెద్దగా ప్రమాదం లేదని… మైనర్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారని సమాచారం. సర్జరీ అనంతరం.. ఇప్పుడు షారుఖ్ స్వదేశానికి తిరిగి వచ్చారని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం గురించి షారుఖ్ టీమ్ స్పంధించలేదు. అయితే ఈ ప్రమాదం జరిగి చాలా రోజులు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం షారుఖ్ క్షేమంగా ఉన్నారని తెలిసి అభిమానులు రిలాక్స్ అయ్యారు.

ఇదిలా ఉంటే… చాలా కాలం తర్వాత షారుఖ్ పఠాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం షారుఖ్ జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇదే కాకుండా.. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ అనే సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us