Zareen Khan: ‘మా ముందే దుస్తులు వేసుకోవచ్చుగా?’.. ఫోటోగ్రాఫర్ కామెంట్ పై హీరోయిన్ ఆగ్రహం..

బాలీవుడ్ ప్రముఖ నటి , మోడల్ అయిన జరీన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2010లో అనిల్ శర్మ దర్శకత్వంలో వచ్చిన 'వీర్' సినిమాతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆమె సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించారు. ఆ తర్వాత ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ సల్మాన్ ఖాన్ నటించిన 'రెడీ' (2011) చిత్రంలో ఆమె చేసిన "క్యారెక్టర్ థీలా" స్పెషల్ సాంగ్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.

Zareen Khan: మా ముందే దుస్తులు వేసుకోవచ్చుగా?.. ఫోటోగ్రాఫర్ కామెంట్ పై హీరోయిన్ ఆగ్రహం..
Zareen Khan

Updated on: Jul 14, 2026 | 8:10 PM

బాలీవుడ్ స్టార్స్ ఎక్కడికి వెళ్లినా వారిని నీడలా వెంబడించడం, ఫోటోలు, వీడియోలు తీయడం ముంబై పాపరాజీలకు (ఫోటోగ్రాఫర్స్) అలవాటే. అయితే కొన్నిసార్లు ఈ ఉత్సాహం హద్దులు దాటి సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఉంటుంది. ఇదివరకు చాలా మంది సెలబ్రెటీలు ఫోటోగ్రాఫర్స్ కారణంగా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇటీవల కొందరు హీరోయిన్స్ తమను వెనుక నుంచి ఫోటోస్ తీయడం.. అలాగే జూమ్ చేస్తూ ఫోటోస్ తీయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌కు ముంబైలో ఇలాంటి ఒక చేదు అనుభవమే ఎదురైంది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొందరు ఫోటోగ్రాఫర్లపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల జరీన్ ఖాన్ ముంబైలోని ఒక ప్రముఖ డిజైనర్ స్టోర్‌కు వెళ్లారు. అక్కడ ఆమె కొన్ని దుస్తులను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రంలోనే సెలబ్రిటీల కదలికలపై నిఘా ఉంచే పాపరాజీలు అక్కడికి కూడా చేరుకుని, ఆమె లోపలికి వెళ్తున్న సమయంలో కెమెరాలతో చుట్టుముట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా, కొందరు ఫోటోగ్రాఫర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

అందులో ఒక ఫోటోగ్రాఫర్ ట్రయల్ కరో.. (దుస్తులు వేసుకోండి) అని అన్నారు. ఈ కామెంట్స్ విన్న జరీన్ ఖాన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తీవ్ర అసహనానికి లోనైన ఆమె, అక్కడికక్కడే ఆ ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డారు. ఏంటీ.. మీ ముందేనా… ? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు. మీ హద్దులు దాటొద్దు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అలాగే మహిళల పట్ల మాట్లాడేటప్పుడు కనీస మర్యాద, విచక్షణ ఉండాలని హెచ్చరించారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జరీన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాన్ని, ఆమె స్పందించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సెలబ్రిటీలకైనా ప్రైవసీ ఉంటుందని, ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలను అస్సలు సహించకూడదని మద్దతు తెలుపుతున్నారు. పాపరాజీలు తమ పరిధులు తెలుసుకుని ప్రవర్తించాలని, పబ్లిక్ లైఫ్‌లో ఉన్నంత మాత్రాన వ్యక్తిగత గౌరవాన్ని పణంగా పెట్టలేరని బాలీవుడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. సల్మాన్ ఖాన్ ‘వీర్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన జరీన్ ఖాన్, తన బోల్డ్ , స్పష్టమైన వైఖరితో ఈ ఘటన ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

జరీన్ ఖాన్ వీడియో..

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us