Pravina Deshpande: ఇండస్ట్రీలో విషాదం.. బాలీవుడ్ నటి కన్నమూత.. క్యాన్సర్‌తో పోరాడి చివరకు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి ప్రవీణ దేశ్ పాండే కన్నుమూశారు. ఆమె వయసు 60 సంవత్సరాలు. గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. చికిత్స తీసుకుంటూనే సినిమాల్లో నటించారు. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రవీణ మృతితో సినీరంగంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Pravina Deshpande: ఇండస్ట్రీలో విషాదం.. బాలీవుడ్ నటి కన్నమూత.. క్యాన్సర్‌తో పోరాడి చివరకు.
Pravina Deshpande

Updated on: Feb 18, 2026 | 7:43 AM

బాలీవుడ్ సినీరంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి ప్రవీణ దేశ్ పాండే కన్నుమూశారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. దీంతో ఆమె మృతి పట్ల సినీప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. నాటకాల్లో శిక్షణ పొందిన ప్రవీణ ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోశారు. నటనా జీవితం రంగస్థలంపై ప్రారంభించి నటిగా తనదైన ముద్ర వేసింది. సీరియల్స్, సినిమాల్లో నటించి వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Actress Prathyusha : స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్స్‏లో సూసైడ్.. హీరోయిన్ ప్రత్యూష ఎలా చనిపోయిం

హిందీ భాషతోపాటు మరాఠీలోనూ తనదైన ముద్ర వేశారు. సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రెడీలో ముఖ్య పాత్రతో మరింత పాపులర్ అయ్యారు. అలాగే గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమా సైతం ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. 2019లో ఆమె మల్టిపుల్ మైలోమా (బ్లడ్ క్యాన్సర్ రకం) బారిన పడ్డారు. ఓవైపు చికిత్స తీసుకుంటూనే నటనను కొనసాగించారు. 2023లో కొంత విరామం తర్వాత మళ్లీ నటించారు. ప్రవీణ దేశ్‌పాండే ఇటీవల విడుదలైన నీరజ్ పాండే వెబ్ సిరీస్ ‘తస్కారి’లో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు మళ్లీ నటించాలని ఉందని.. జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నానని అన్నారు. కానీ అంతలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ప్రవీణ చేసిన చివరి మాటలు గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.

ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

ప్రవీణ.. జలేబీ, ఏక్ విలన్, గబ్బర్ ఈజ్ బ్యాక్, బ్లాక్‌మెయిల్, హ్యాక్డ్, ది ఫ్యామిలీ మ్యాన్, స్మగ్లింగ్ వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తంచేసింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

Follow Us