Anupam Shyam: బాలీవుడ్‌‌‌లో విషాదం.. అనారోగ్యంతో ప్రముఖ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ కన్నుమూత.. పలువురి సంతాపం

బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి..

Anupam Shyam: బాలీవుడ్‌‌‌లో విషాదం.. అనారోగ్యంతో ప్రముఖ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ కన్నుమూత.. పలువురి సంతాపం
Anupam Shyam

Updated on: Aug 09, 2021 | 7:46 AM

Anupam Shyam: బాలీవుడ్‌‌‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి మృతి చెందారని శ్యామ్‌ స్నేహితుడు యశ్‌పాల్‌ శర్మ తెలిపారు. అనుపమ్‌ మన్‌ కీ ‘ఆవాజ్‌ ప్రతిజ్ఞ’తో పాటు పలు టీవీ సీరియల్స్‌, అలాగే  స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌, బందిపోటు, కంగనా నటించిన క్వీన్‌ వంటి సినిమాల్లో నటించారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయను కుటుంబసభ్యులు సబర్బన్‌ గోరేగావ్‌లోని లైఫ్‌లైన్‌ ఆసుప్రతిలో చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో  చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి కన్నుమూశారు. అనుపమ్‌ శ్యామ్‌ సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు యశ్‌పాల్‌ శర్మ తెలిపారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ నట జీవితంలో శ్యామ్‌ ‘సత్య, దిల్‌ సే, లగాన్‌, హజారోన్‌ ఖ్వైషేన్‌ ఐసీ’వంటి చిత్రాలతో నటించారు.

గతేడాది సైతం అనుపమ్‌ శ్యామ్‌ అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన డయాలసిస్‌ చేయించిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆసుప్రతిలో చేర్పించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వైద్య సహాయానికి ఆర్థిక సహకారం అందించాలని అభ్యర్థించారు. ఆ తర్వాత కోలుకున్న ఆయన.. మరోసారి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుప్రతిలో చేరి.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ‘మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’ సీరియల్‌లో ఠాకూర్‌ సజ్జన్‌ సింగ్‌ పాత్ర పోషించిన ఆయన.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2009లో ప్రసారమైన ఈ సీరియల్‌.. సెకండ్‌ సీజన్‌ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. అనుపమ్‌ శ్యామ్‌ కన్నుమూయడంతో బాలీవుడ్‌‌‌‌లో విషాదం అలుముకున్నాయి. పలువురు సినిమా తారలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: విజయేంద్ర ప్రసాద్ గడ్డం పై వర్మ సంచలన కామెంట్స్.. అంతమాట అనేశాడేంటి..!!

Sarkaru Vaari Paata Blaster: పవర్ ప్యాక్ బ్లాస్టర్ వచ్చేసింది.. విశ్వరూపం చూపించిన ప్రిన్స్‌.. అభిమానులకు ఇక పండగే

సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. ఈషా అందాల ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

Loading...
Unable to load recommendations.
Follow Us