ఐస్ బకెట్ ఛాలెంజ్, లెమన్ ఫేస్ ఛాలెంజ్ తరహాలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘జుగ్ను ఛాలెంజ్’ ట్రెండింగ్‌లో ఉంది. ప్రముఖ ర్యాప్ సింగర్ బాద్షా రూపొందించిన ఈ డ్యాన్స్ ఛాలెంజ్‌లో ‘ఛంపి స్టెప్’, ‘టిల్ట్ మాస్టర్’, ‘డ్రిబ్లింగ్ బాల్’, ‘ఖండాలా స్టెప్’ అని నాలుగు దశలుంటాయి. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు వీటికి అనుగుణంగా కాలు కదపాల్సి ఉంటుంది. అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, రణ్వీర్ సింగ్, కత్రినా కైఫ్, వరుణ్ ధావన్ తదితరులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాదు తమ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
మేడమ్…మీ డ్యాన్స్ సూపర్బ్…
తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ ‘జుగ్ను’ డ్యాన్స్ ఛాలెంజ్‌ను స్వీకరించింది. అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చాలా రోజుల తర్వాత అనుష్కా డ్యాన్స్‌ను చూశాం’, ‘మేడమ్…మీ గ్రేస్ ఏ మాత్రం మారలేదు..డ్యాన్స్ సూపర్బ్’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2018లో విడుదలైన ‘జీరో’ సినిమాలో చివరిసారిగా కనిపించింది అనుష్క. ఆ తర్వాత సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించలేదు. అయితే ప్రొడ్యూసర్‌గా కొన్ని విభిన్న సినిమాలను తెరకెక్కించి విజయాలు అందుకుంది.
Also Read: