Amitabh Bachchan: కరోనాని లెక్కచేయని మొండిఘటం.. కేబీసీని కంటిన్యూ చేయనున్న బిగ్ బి..

|

May 08, 2021 | 8:49 AM

ఇండియన్ టెలివిజన్‌ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి. అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్ చేస్తున్న ఈ షోలో పాల్గొనటం

Amitabh Bachchan: కరోనాని లెక్కచేయని మొండిఘటం.. కేబీసీని కంటిన్యూ చేయనున్న బిగ్ బి..
Follow us on

Amitabh Bachchan: ఇండియన్ టెలివిజన్‌ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి. అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్ చేస్తున్న ఈ షోలో పాల్గొనటం చాలా మందికి ఓ డ్రీమ్‌. అందుకే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ షోకు బ్రేక్‌ ఇవ్వటం లేదు ఆర్గనైజర్స్. కోవిడ్‌ సిచ్యుయేషన్‌లోనూ అన్ని జాగ్రత్తలతో షో కంటిన్యూ చేస్తున్నారు.

లాస్ట్ ఇయర్‌ కేబీసీ షూట్‌లోనే కరోనా బారిన పడ్డారు అమితాబ్‌ బచ్చన్‌…అయినా సరే తిరిగి కోలుకున్న తరువాత అన్ని జాగ్రత్తలతో షో కంప్లీట్ చేశారు. కాకపోతే కోవిడ్ నేపథ్యంలో ఆడియన్స్‌ లేకుండా, సోషల్ డిస్టాన్స్‌ పాటిస్తూ షో నిర్వహించారు. లాస్ట్ సీజన్‌ సక్సెస్‌ కావటంతో ఈ ఇయర్‌ కూడా నయా సీజన్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. కౌన్ బనేగా కరోర్ పతి సక్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణాలలో గ్రేట్ హోస్ట్  లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ .. అనేక సీజన్లకు హోస్ట్ గా కొనసాగారు బిగ్ బి. ఇప్పుడు అన్ని ప్రోటోకాల్ లకు కట్టుబడి పని చేస్తున్నారు. గత సీజన్ లో కోవిడ్ -19 పాజిటివ్ పరీక్షించినప్పటికీ అమితాబ్ బచ్చన్ కోలుకున్న వెంటనే తిరిగి సెట్స్ లోకి వచ్చారు. ఇప్పుడు 13 వ సీజన్ తో ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ ఇయర్‌ కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన అన్ని కండిషన్స్‌ను కంటిన్యూ చేస్తూ 13th సీజన్‌ను స్టార్ట్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్‌ చేశారు. మరోసారి అమితాబ్ హోస్ట్ చేస్తున్న ఈ షోకు సంబంధించిన రిజిస్టేషన్స్‌ మే 10 న ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్‌.  మరికొద్ది రోజుల్లోనే కేబీసీ ప్రేక్షకులను అలరించడానికి రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

కరోనా బారిన పడ్డ శిల్పాశెట్టి కుటుంబం.. మా ఫ్యామిలీకి చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..

Adipurush: మకాం మార్చిన ఆదిపురుష్ టీం.. ఇక పై షూటింగ్ అంతా అక్కడే.. అసలు కారణం అదే..

కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. ‘రాధే’ సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..