Amitabh Bachchan birthday: బ్రహ్మాస్త్ర కంటే ముందే అమితాబ్‌ హీరోగా భారీ విజువల్‌ మూవీకి ప్లాన్‌.. ఆ ఒక్క కారణంతో ఆగిపోయిన సినిమా..

బిగ్ బీ..ప్రస్తుతం భారీ విజయం అందుకున్న విజువల్ వండర్ బ్రహ్మస్త్ర కంటే ముందే భారీ వీఎఫ్ఎక్స్ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో వీఎఫ్ఎక్స్ టాలిస్మాన్ అనే టైటిల్ తో తెరకెక్కించాలనుకున్న సినిమా గురించి తెలుసుకుందామా.

Amitabh Bachchan birthday: బ్రహ్మాస్త్ర కంటే ముందే అమితాబ్‌ హీరోగా భారీ విజువల్‌ మూవీకి ప్లాన్‌.. ఆ ఒక్క కారణంతో ఆగిపోయిన సినిమా..
Amitabh Bachan
Follow us

|

Updated on: Oct 11, 2022 | 9:30 AM

మంగళవారం (అక్టోబర్ 11న) బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ 80వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు.. సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేవలం నార్త్ లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులున్నారు. అంతేకాదు.. బాలీవుడ్ కా మెగాస్టార్ బిరుదు సైతం సొంతం చేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన బిగ్ బీ.. ప్రస్తుతం వెండితెరపైనే కాకుండా.. బుల్లితెర పై కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎంతో మంది నటీనటులకు స్పూర్తిదాయకంగా నిలిచిన అమితాబ్ సినీ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆత్మవిశ్వాసం..పట్టుదలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాందించుకున్నారు. బిగ్ బీ పుట్టినరోజు అంటే.. బీటౌన్ ఇండస్ట్రీలో పెద్ద పండగ వాతావరణం. దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కెరీర్‏లో ఎన్నో హిట్స్ అందుకున్న బిగ్ బీ..ప్రస్తుతం భారీ విజయం అందుకున్న విజువల్ వండర్ బ్రహ్మస్త్ర కంటే ముందే భారీ వీఎఫ్ఎక్స్ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో వీఎఫ్ఎక్స్ టాలిస్మాన్ అనే టైటిల్ తో తెరకెక్కించాలనుకున్న సినిమా గురించి తెలుసుకుందామా.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ విధు వినోద్ చోప్రా కలిసి భారతీయ కల్పిత కథ అయిన చంద్రకాంత ఆధారంగా టాలిస్మాన్ అనే సినిమా తెరకెక్కించాలనుకున్నారు. దాదాపు 14 పేజీల డ్రాఫ్ట్‏ను రెండున్నర సంవత్సరాలకు పైగా ఈ సినిమా కోసం రాశారు. రామ్ మాధ్వానీ, రచయిత స్వానంద్ కిర్కిరే ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని భావించారు. ఈ సినిమాకు టీజర్ కూడా ప్లాన్ చేశారు. కానీ అనుహ్యంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ ప్రాజెక్ట్ ఏమైంది ?.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం టాలిస్మాన్ సినిమా బడ్జెట్ ఓవర్ బోర్డుకు వెళ్లింది. దాదాపు 8-9 సంవత్సరాల క్రితం ఈ సినిమా చాలా ప్రమాదకమరైన వెంచర్‏గా పరిగణించారు. దీంతో ఈ సినిమాను ఆపేయడం మంచిదని భావించారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తరహాలో ఏదో జరుగుతుందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిన తర్వాత రామ్ మాధ్వానీ.. నీర్జా, ధమాకా పలు చిత్రాలకు దర్శకత్వం వహించగా.. స్వానంద్ కిర్కిరే ప్రముఖ రచయిత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ వీఎఫ్ఎక్స్‎తో కూడిన బ్రహ్మస్త్ర సినిమా విడుదలైంది. ఇప్పుడు సినిమా కోసం భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగిపోయిన టాలిస్మాన్ ప్రాజెక్ట్ పునరిద్ధేంచేందుకు బిగ్ బీతోపాటు.. విధు వినోద్ చోప్రా ఆసక్తిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరీ చూడాలి. ఎన్నో అంచనాలతో తెరకెక్కించాల్సిన టాలిస్మాన్ చిత్రం తిరిగి పట్టాలెక్కనుందా ? లేదా ? అనేది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..