Shilpa Shetty: మరో వివాదంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తల్లి, సోదరితోపాటు శిల్పాశెట్టికి కోర్టు నోటిసులు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి (Shilpa Shetty) ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తన భర్త రాజ్ కుంద్రా

Shilpa Shetty: మరో వివాదంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తల్లి, సోదరితోపాటు శిల్పాశెట్టికి కోర్టు నోటిసులు..
Shilpa Shetty

Updated on: Feb 14, 2022 | 9:00 AM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి (Shilpa Shetty) ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తన భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోలు తీయడంతో కేసు నమోదు కావడం.. కొద్ది రోజులు తన భర్త జైలులో ఉండడం.. ఈ కేసులో శిల్పా శెట్టి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కోంది. ఇక అదే సమయంలో శిల్పా శెట్టి పై చీటింగ్ కేసు కూడా నమోదైంది. ఈక్రమంలో ఆమెకు కోర్టు సమన్లు కూడా జారీ చేసి విచారించింది. గతేడాది క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ గడిపిన శిల్పా శెట్టి ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటుంది. ఈ క్రమంలో శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో విడాకులు తీసుకోబోతుందని.. అందుకే రాజ్ కుంద్రా తన విలువైన ఆస్తులను శిల్పా పేరు మీదకు మార్చాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిపై శిల్పా కానీ.. ఆమె భర్త కానీ స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా శిల్పా శెట్టి మరో వివాదం చిక్కుకుంది.

తాజాగా శిల్పా శెట్టికి.. ఆమె తల్లి సునంద, సోదరి షమితా శెట్టికి కోర్టు నోటిసులు ఇచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఆరోపిస్తూ ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని ముంబైలోని అంధేరీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు ఈ నెల 28న కోర్టులో హాజరుకావాలంటూ శిల్పాశెట్టితోపాటు.. ఆమె సోదరి షమితాకు.. తల్లి సునందకు కోర్టును నోటిసులు జారీ చేసింది. శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి 2015లో రూ. 21 లక్షల రుణం తీసుకున్నారు. రుణం తిరిగి 2017 జనవరి నాటికి చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే సురేంద్రశెట్టి అక్టోబర్ 11న 2016లో మృతి చెందారు. అయితే తన తండ్రి అప్పు తీసుకున్న విషయం శిల్పాతోపాటు.. ఆమె తల్లికి కూడా తెలుసునని.. డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారని వ్యాపారవేత్త పర్షద్ అమ్రా ఆరోపించారు. ఇదే విషయంపై గత శుక్రవారం జుహూ పోలీస్ స్టేషన్లో శిల్పాతోపాటు.. ఆమె కుటుంబంపై ఫిర్యాదు చేయగా.. ఈనెల 28న కోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది కోర్టు. దీంతో శిల్పా శెట్టి మరోసారి వివాదంలో చిక్కుకుంది.

Also Read: Krithi Shetty: ఉప్పెన సినిమా విడుదలై ఏడాది పూర్తి .. ఎమోషనల్‌ నోట్‌ పెట్టిన బేబమ్మ..

Gurtunda Seethakalam: వాలెంటైన్స్ డే రోజున మరో స్పెషల్ అప్డేట్.. అందమైన ప్రేమకథ గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రేపే

Malli Modalaindi: కమర్షియల్ అంశాన్ని ఎంటర్‏టైన్‏గా చెప్పడమే ఇష్టం.. అందుకే ఇలా.. డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్..

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..

Loading...
Unable to load recommendations.
Follow Us