Kangana Ranaut: బాలీవుడ్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్.. వాళ్లంతా ఫెయిల్యూర్స్ అంటూ..

|

Apr 05, 2022 | 4:21 PM

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (kangana ranaut) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం సినిమాల విషయంలోనే కాకుండా.

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్.. వాళ్లంతా ఫెయిల్యూర్స్ అంటూ..
Kangana Ranaut
Follow us on

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (kangana ranaut) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం సినిమాల విషయంలోనే కాకుండా… సమాజంలోని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తనదైన శైలీలో స్పందిస్తుంది కంగనా. ప్రస్తుతం ఆమె లాకప్ షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో తానపై తాను ప్రశంసలు కురిపించుకుంది. తన నైపుణ్యాలు, హోస్టింగ్ గురించి గొప్పగా చెప్పుకుంటూ తనను తాను సూపర్ స్టార్ హోస్ట్ అని తెలిపింది. అంతేకాకుండా.. మరోసారి బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా. ఈ మేరకు తన ఇన్ స్టా ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేసింది.

“బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, రణ్ వీర్ సింగ్ వంటి చాలా మంది నటులు పాపులారిటీని సంపాదించుకున్నారు. కానీ వారు హోస్ట్ చేయడంలో విఫలమయ్యారు. ఇప్పటివరకు వాళ్లు హోస్ట్ చేయడంలో సక్సెస్ కాలేదు. ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్ లు మత్రమే సూపర్ స్టార్ హోస్ట్‏గా ఘనత సాధించి.. ఈ లీగ్‏లో ఉండడం విశేషం ” అని రాసుకొచ్చింది. అంతేకాకుండా.. నాపై అసూయతో నేను చేస్తోన్న ఈ షోను అప్రతిష్టపాలు చేయడానికి చూస్తున్నారు. కానీ అది వరి వల్ల కాదు. నేను నన్ను.. నా షోను రక్షించుకుంటాను. ఎంతమంది వచ్చి నన్ను విమర్శించినా నేను పట్టించుకోను.. ఇతరులకు నేను మద్దతు ఇస్తేనే.. నాకు నేను నిలబడగలను. హోస్ట్ గా విజయం సాధించడం సంతోషంగా ఉంది అని తెలిపింది.

Kangana

కంగనా హోస్ట్‎గా వ్యవహరిస్తున్న లాకప్ షో ఆల్డ్ బాలాజీ, mx playerలో ప్రసారమవుతుంది. ఇందులో కరణ్ వీర్ బోహ్రా, సైషా షిండే, జీషన్ ఖాన్, మందన కరీమి, పాయల్ రోహత్గి, పూనమ్ పాండే, నిషా రావల్ పాల్గొంటున్నారు.గత నెలలో ఈ రియాలిటీ షో 100m వ్యూస్ క్రాస్ చేసి.. ఓటీటీలోనే అత్యధికంగా వ్యూస్ సాధించిన రియాలిటీ షోలలో ఒకటిగా నిలిచింది.

Also Read: Ram Charan: రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా నుంచి ఫోటో లీక్‌.. ఆసక్తిరేకెత్తిస్తోన్న చెర్రీ కొత్త లుక్‌..

Ghani Movie: ఆకట్టుకుంటోన్న గని మేకింగ్‌ వీడియో.. వరుణ్‌ డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌..

Kalyani Priyadarshan : నవ్వే నయాగరం.. చూపే సుమబాణం.. క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ భామ

OTT & Theater Movies: ఈవారం థియేటర్లు/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే.. లిస్టులో మెగా మూవీ..