
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరోలలో రణ్వీర్ సింగ్ సింగ్ ఒకరు. కేవలం నటనతోనే కాకుండా.. లెటేస్ట్ ఫ్యాషన్ పోకడలను అనుసరిస్తూ.. ఎప్పటికప్పుడూ కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించడంలో ముందుంటాడు ఈ బాలీవుడ్ హీరో. చాలా సందర్భాల్లో రణ్వీర్ సింగ్ ప్రత్యేకమైన ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అందులో ముఖ్యంగా హిజ్రా తరహా గెటప్పులలో కనిపించి తన ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేశాడు. తాజాగా మరోసారి ఢిఫరెంట్ గెటప్ లో కనిపించి షాకిచ్చాడు రణ్వీర్ సింగ్.
టాప్ టూ బాటప్ బ్లూకలర్ బూచీ డ్రెస్‌తోపాటు.. ఒంటి నిండా బంగారు నగలతో.. పొడవైన జుట్టుతో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక రణ్వీర్ సింగ్ న్యూలుక్ ఫోటోస్ రివీల్ కాగానే సోషల్ మీడియా మీమ్స్‌తో షేకైంది. రణ్వీర్ నయా లుక్ ఫోటోస్ తో ఇంటర్నెట్ అల్లాడింది. ఈ న్యూలుక్ ను రణ్వీర్ ప్రముఖ గూచీ క్రియేటివ్ డైరెక్టర్ అలెశాండ్రో మిచెల్ కు అంకితం చేశాడు. ఈ గూచీ స్టైల్లో 1961 నాటి హ్యాండ్ బ్యా్గ్ స్లైల్ ఉపయోగించుకున్నారట.
ఇక రణ్వీర్ సింగ్ న్యూలుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రణ్వీర్ విచిత్రమైన ఫోటోలతో నెట్టింట్లో మీమ్స్ ఫెస్ట్ జరుగుతోంది. రణ్వీర్ 21వ శతాబ్ధపు అల్లావుద్దీన్ ఖిల్జీ వెర్షన్ ను గుర్తుచేశాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు నిజంగానే మీరు యునికార్స్ కాదా ? అని.. మరికొందరు జీసస్ మోడ్రన్ వెర్షన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ 83 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ పాత్రను పోషిస్తున్నాడు రణ్వీర్.
ట్వీట్..
మీమ్స్..
Also Read: Ajith Kumar : ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాకుండా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న అజిత్ సినిమా..