డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు చోటు ఇవ్వని బన్నీ మూవీ!

|

Oct 15, 2019 | 4:09 PM

డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత సినిమాల పరిస్థితి దారుణంగా మారింది. భాష ఏదైనా నెల రోజుల వ్యవధిలోనే సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒరిజినల్ ప్రింట్స్‌తో దర్శనమిస్తున్నాయి. దానితో అధికంగా డబ్బులు ఖర్చుపెట్టి థియేటర్ల దగ్గరకు వెళ్లకుండా కుటుంబంతో పాటుగా ఇంట్లోనే ఆన్లైన్‌లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీని వల్ల సినిమా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతున్నా.. దర్శక నిర్మాతలు ఏమాత్రం అదుపు చేయలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో స్టైలిష్ స్టార్ […]

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు చోటు ఇవ్వని బన్నీ మూవీ!
Follow us on

డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత సినిమాల పరిస్థితి దారుణంగా మారింది. భాష ఏదైనా నెల రోజుల వ్యవధిలోనే సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒరిజినల్ ప్రింట్స్‌తో దర్శనమిస్తున్నాయి. దానితో అధికంగా డబ్బులు ఖర్చుపెట్టి థియేటర్ల దగ్గరకు వెళ్లకుండా కుటుంబంతో పాటుగా ఇంట్లోనే ఆన్లైన్‌లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీని వల్ల సినిమా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతున్నా.. దర్శక నిర్మాతలు ఏమాత్రం అదుపు చేయలేకపోతున్నారు.

ఇలాంటి తరుణంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘అల వైకుంఠపురంలో’ ఈ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ చిత్రానికి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌గా వ్యవహరిస్తున్న బ్లూ స్కై సినిమాస్.. తమ చిత్రాన్ని అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా చూడలేరని తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాక సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేవరకు ఎలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌‌కు అమ్మట్లేదని తేల్చి చెప్పేసింది. ఇక ఈ సరికొత్త నిర్ణయంతో ప్రేక్షకులు ఇంటి మాట పక్కన పెట్టి థియేటర్ల వైపుకు దారి మళ్లే సూచన కనిపిస్తోంది. ఏది ఏమైనా మిగిలిన సినిమాలు కూడా వీరిలానే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందరూ కూడా ఈ నిర్ణయాన్ని ఫాలో అవుతారో లేదో వేచి చూడాలి.