కోర్టుకు రాకుంటే బెయిల్ క్యాన్సిల్ చేస్తాం: సల్మాన్‌కు హెచ్చరిక

| Edited By: Pardhasaradhi Peri

Jul 04, 2019 | 4:48 PM

కృష్ణజింకలను వేటాడిన కేసు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ను వదలడం లేదు. ఈ కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్.. రెండు రోజులు జైలులో ఉండి ఆ తరువాత బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తదుపరి విచారణకు సల్మాన్‌ హాజరుకాకపోతే బెయిల్ రద్దు చేస్తామని జోధ్‌పూర్ కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. కాగా 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ […]

కోర్టుకు రాకుంటే బెయిల్ క్యాన్సిల్ చేస్తాం: సల్మాన్‌కు హెచ్చరిక
Follow us on

కృష్ణజింకలను వేటాడిన కేసు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ను వదలడం లేదు. ఈ కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్.. రెండు రోజులు జైలులో ఉండి ఆ తరువాత బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తదుపరి విచారణకు సల్మాన్‌ హాజరుకాకపోతే బెయిల్ రద్దు చేస్తామని జోధ్‌పూర్ కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది.

కాగా 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ కోసం జోధ్‌పూర్‌ వెళ్లిన సల్మాన్.. తన తోటి నటీనటులతో కలిసి కృష్ణజింకలను వేటాడాడు. 20ఏళ్ల విచారణ అనంతరం గతేడాది ఏప్రిల్ 5న ఈ కేసులో తుది తీర్పు చెప్పిన జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది.