బాలీవుడ్‌ స్టార్ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ఇంట తీవ్ర విషాదం..

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆచార్య పి ఖురానా శుక్రవారం (మే 19) ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం పంజాబ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన తుది శ్వాస..

బాలీవుడ్‌ స్టార్ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ఇంట తీవ్ర విషాదం..
Ayushmann Khurrana

Updated on: May 19, 2023 | 7:09 PM

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆచార్య పి ఖురానా శుక్రవారం (మే 19) ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం పంజాబ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య అపరశక్తి ఖురానా, కుమారుడు ఆయుష్మాన్ ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

కాగా ఆయుష్మాన్‌ ఖురానా తండ్రి పి ఖురానా ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యుడు. జ్యోతిష్యంపై పలు పుస్తకాలు కూడా రచించారు. హార్ట్‌ సంబంధిత సమస్యతో పంజాబ్‌లోని మొహిలీలో ఫర్టిస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 10:30 గంటలకు మరణించారు. ఆయన స్వస్థలమైన చత్తీస్‌ఘడ్‌లో ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

2020లో, మే 18న ఆయుష్మాన్ ఖురాన్‌ తండ్రి పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీరు నాకు రెక్కలు, ట్యాలెంట్‌, ఆశయాన్ని అందించారు. మీ వయస్సును నేను ప్రపంచానికి చెప్పను. ఎందుకంటే వారు నమ్మలేరు’ అని తండ్రికి పంపిన ఆయుష్మాన్ త్రోబ్యాక్ బర్త్‌డే పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us