‘అర్జున్ సురవరం’కు ‘అవెంజర్స్’ దెబ్బ..!

|

Apr 25, 2019 | 4:43 PM

గత కొంతకాలంగా ‘అర్జున్ సురవరం’ సినిమాను చిత్ర నిర్మాతలు థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నా.. సరైన విడుదల తేదీ దొరకట్లేదు. ఇలా పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టికేలకు మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. దీనికి అనుగుణంగా హీరో నిఖిల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈనెల 26న తెలుగు రాష్ట్రాల్లో అవెంజర్స్ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకు అనుకున్న […]

అర్జున్ సురవరంకు అవెంజర్స్ దెబ్బ..!
Follow us on

గత కొంతకాలంగా ‘అర్జున్ సురవరం’ సినిమాను చిత్ర నిర్మాతలు థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నా.. సరైన విడుదల తేదీ దొరకట్లేదు. ఇలా పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టికేలకు మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. దీనికి అనుగుణంగా హీరో నిఖిల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు.

అయితే తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈనెల 26న తెలుగు రాష్ట్రాల్లో అవెంజర్స్ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకు అనుకున్న రేంజ్ లో థియేటర్లు దొరకడం లేదట. దాంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక ఈరోజు జరగాల్సిన ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను కూడా రద్దు చేసుకున్నారు.

టి ఎన్ సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ హిట్ మూవీ ‘కనితన్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.