Throwback photo: గల గలా మాట్లాడే జలపాతం ఈ యాంకరమ్మ.. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.?

Viral Photo: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలు ఫ్యాన్స్‌తో ఇంట్రాక్షన్‌ పెరుగుతోంది. తమ వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో...

Throwback photo: గల గలా మాట్లాడే జలపాతం ఈ యాంకరమ్మ.. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.?
Viral Photo

Updated on: Nov 21, 2021 | 11:05 AM

Viral Photo: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలు ఫ్యాన్స్‌తో ఇంట్రాక్షన్‌ పెరుగుతోంది. తమ వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో త్రో బ్యాక్‌ ఫోటోలకు ప్రాధాన్యత పెరుగుతోంది. చిన్నతనంలో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం అనే ట్రెండ్ ఎక్కువైంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు తమ చిన్ననాటి ఫోటోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఇందులో నటీమణులు ముందు వరుసలో ఉంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌ ప్రముఖ యాంకర్‌ జాన్సీ తన చిన్ననాటి ఫొటోను ఒకటి పోస్ట్‌ చేశారు. 9వ తరగతిలో దిగిన ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ‘వయసు పెరుగుతున్నప్పుడు త్వరగా పెద్దవ్వాలని కోరుకుంటాం.. పెద్దయ్యాక మాత్రం యవ్వనంగా కనిపించాలని కోరుకుంటాం’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ప్రస్తుతం జాన్సీ పోస్ట్‌ చేసిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. జాన్సీ అభిమానులు పెద్ద ఎత్తున లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు.

ఓ అభిమాని కామెంట్‌ చేస్తూ.. ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలో మీరు కాలేజీ అమ్మాయిలా కనిపిస్తే.. కలర్‌ ఫోటోలో డిగ్రీ పాసైన అమ్మాయిలా ఉన్నారు. మీరెప్పటికీ యంగ్‌గానే ఉంటారు’ అని రాసుకొచ్చాడు. జాన్సీ చిన్ననాటి ఫోటో చూస్తే ఇది అక్షరాల నిజం అనిపించకమానదు.

Also Read: Vasanthi Krishnan: “క్యాలీఫ్లవర్” టైటిల్ సంపూర్ణేష్ బాబు కరెక్ట్‌గా సూటైంది.. హీరోయిన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Viral Video: వావ్‌ అద్భుతం !! హ్యారీపాటర్‌ సినిమాలోలా !! వీడియో

Viral Video: నోట్లోంచి సాలె పురుగు !! ఒళ్లు గగుర్పొడిచే వీడియో !! వీడియో