బన్నీ హిట్ పాట రీమిక్స్‌లో సల్మాన్‌..!

| Edited By:

Jun 05, 2020 | 8:48 PM

బన్నీ హిట్ పాట రీమిక్స్‌లో సల్మాన్‌ ఖాన్ చిందులు వేయబోతున్నారా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి బాలీవుడ్‌లో. సల్మాన్‌ ఖాన్‌, ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే' చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

బన్నీ హిట్ పాట రీమిక్స్‌లో సల్మాన్‌..!
Follow us on

బన్నీ హిట్ పాట రీమిక్స్‌లో సల్మాన్‌ ఖాన్ చిందులు వేయబోతున్నారా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి బాలీవుడ్‌లో. సల్మాన్‌ ఖాన్‌, ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. దక్షిణ కొరియా చిత్రం వెటరన్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జాకీ ష్రాఫ్, రణ్‌దీప్‌ హుడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ మూవీలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయట. అందులో రెండు పాటలను షాజీద్-వాజీద్‌ కంపోజ్ చేశారు(వాజీద్ ఇటీవలే కరోనాతో మరణించారు).

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సల్మాన్‌ మరోసారి దేవీ శ్రీకి ఆఫర్ ఇచ్చినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సల్మాన్‌ కోసం బన్నీ పాటను రీమిక్స్‌ చేయబోతున్నారట దేవీ. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్‌లోని సిటీ మార్ పాటను ‘రాధే’ కోసం రీమిక్స్‌ చేశారట దేవీ. ఇప్పటికే ఈ పాటను సల్మాన్ వినేయడం, ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఇదివరకే సల్మాన్‌ ఓ బన్నీ పాట రీమిక్స్‌లో నటించారు. రెడీ చిత్రంలో ”డింకచక.. డింకచక”(రింగ రింగ రీమిక్స్‌) పాటలో సల్మాన్‌ మెరిశారు. ఈ పాట అక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ మూవీ తరువాత సల్మాన్‌ జయహో చిత్రం కోసం దేవీ ఓ మ్యూజికల్ ట్రాక్‌ను కంపోజ్ చేశారు. అది కూడా హిట్ అవ్వగా.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మూడో పాట రాబోతోంది.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్.. ఏపీ సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు..!