మహేష్‌ అలా పిలుస్తుంటే ఇబ్బందిగా ఉండేది: అల్లరి నరేష్‌

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు.

మహేష్‌ అలా పిలుస్తుంటే ఇబ్బందిగా ఉండేది: అల్లరి నరేష్‌

Edited By:

Updated on: Apr 25, 2020 | 1:54 PM

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విజయం సాధించడంతో పాటు అల్లరి నరేష్ పాత్రకు మంచి పేరొచ్చింది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేష్.. మహేష్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మహేష్‌ బాబు నన్ను సర్‌ అని పిలిచేవారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆయన నటన చూసి చాలా ముగ్ధుడినయ్యా. ఆయనతో స్క్రీన్‌ను పంచుకున్న తరువాత ఒక పర్సన్‌గా మహేష్‌ బాబు అంటే ఏంటో చాలా తెలుసుకున్నా. సినిమాలు, కుటుంబం గురించి పక్కనపెడితే ఆయన టాలీవుడ్‌ యువరాజు. అంతేకాదు మహేష్ బాబు గురించి ఎక్కువ ఏం చెప్పాలి అని అన్నారు. కాగా నరేష్ ప్రస్తుతం నాంది అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగెష్న నిర్మిస్తున్నారు.

Read This Story Also: ఇన్‌స్టా పోస్ట్‌తో అమలకు కౌంటర్ ఇచ్చిన సమంత..!