‘మేజర్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన అడవిశేష్.. మహేష్ స్క్రిప్ట్ కూడా వినలేదట !

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో అడవిశేష్ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.

  • Rajeev Rayala
  • Publish Date - 9:59 am, Sat, 19 December 20
'మేజర్' సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన అడవిశేష్.. మహేష్ స్క్రిప్ట్ కూడా వినలేదట !

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో అడవిశేష్ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. త్వరలో అడవి శేష్ ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడవిశేష్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. ” ‘మహేష్ గారు ఆయన సతీమణి నమ్రత గారు నా పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. దాంతో బెస్ట్ సినిమానా చేయడానికి నా పైన చాలా ప్రజెర్ ఉంది. ఇక నేను ‘మేజర్’ స్క్రిప్ట్ ను నమ్రతా గారికి మాత్రమే చెప్పను. మహేష్ గారు కనీసం స్క్రిప్ట్ కూడా వినలేదు. అయినా నా మీద నమ్మకం ఉంచారు. మనం గొప్ప సినిమా చేస్తున్నామని నమ్రతా గారు చెప్పారు.  ‘మేజర్’ సినిమా చాలా బాగా వస్తోంది. ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని ‘అన్నారు. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా నటించడం ఎంతో గర్వంగా ఉందని’ అడవిశేష్ అన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు.